Begin typing your search above and press return to search.
విడాకుల రూట్లో దర్శకుడు క్రిష్??
By: Tupaki Desk | 31 May 2018 5:07 PM GMTటాలీవుడ్ దర్శకుల్లో జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ దర్శకుడితో కనీసం ఒక్క సినిమా అయినా తీయాలని కోరుకుంటారు. అవకాశం అంటూ వస్తే.. పారితోషికం ఇవ్వకపోయినా పర్లేదని ఓపెన్ గానే చెప్పేస్తుంటారు. అలాంటి దర్శకుడు.. తన పెళ్లి చేసుకున్న అతి తక్కువ కాలంలోనే విడాకుల రూట్ పట్టినట్లు తెలుస్తోంది.
క్రిష్-రమ్యలకు ఆగస్ట్ 7.. 2016లో పెళ్లి జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ షూటింగ్ కు మధ్యలో 3 వారాల పాటు బ్రేక్ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు క్రిష్. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా.. ఈ ఇద్దరూ ఎంతగానే ఆకట్టుకున్నారు. వారి పెళ్లి సమయంలో మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన అల్లరి సందడిని అసలు మరిచిపోలేం. అయితే.. ఇప్పుడు వీరిద్దరు విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విడాకులకు కారణం ఏంటనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.
డాక్టర్ రమ్య.. డైరెక్టర్ క్రిష్ మధ్య విబేధాలు అంతగా లేవని.. వీరిద్దరి మధ్య అవగాహన కుదరలేదని.. అందుకే ఇద్దరూ సమ్మతంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ మణికర్ణికకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్.. ఇది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు