Begin typing your search above and press return to search.
తెరపైకి మరోసారి సిల్క్ స్మిత బయోపిక్...!
By: Tupaki Desk | 3 Oct 2020 11:30 PM GMTభారతీయ సినీ ప్రేక్షకులను సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళం సినిమాతో వెండితరకు పరిచయమైన సిల్క్ స్మిత అతి తక్కువ కాలంలోనే ఎవరు ఊహించని క్రేజ్ అందుకుంది. చూస్తుండగానే సౌత్ లో బిజీగా మారిపోయింది. తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారనే విమర్శలకి కౌంటర్ ఇచ్చేలా బోల్డ్ రోల్స్ చేసిన డేరింగ్ గర్ల్ సిల్క్ స్మిత. తన నిషా కళ్ళతో సినీ ప్రేక్షకులను కళ్ళు తిప్పనివ్వకుండా చేసింది. తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషలలో 200పైగా సినిమాలలో నటించి తానేంటో నిరూపించుకుంది. ఒకవైపు ప్రధాన పాత్రలను.. చేస్తూనే ఐటమ్ సాంగ్స్ తోను అదరగొట్టింది. గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసి విజయం సాధించినా.. తన పేరులోని విజయం మాత్రం జీవితంలో చవిచూడలేకపోయింది. ఆమె జీవితంలో ప్రేమ, పెళ్లి అనేవి బాగా ప్రభావం చూపాయని చెప్పుకుంటారు.
కొన్నేళ్లపాటు ప్రేక్షకులను అలరించిన సిల్క్ స్మిత మరణం ఇప్పటికే అంతుచిక్కని మిస్టరీనే. సినిమా నిర్మాణంలో పెద్ద మొత్తంలో పెట్టి నష్టపోయినందుకు ఆత్మహత్య చేసుకొన్నారని కొంతమంది భావిస్తారు. మరికొంతమంది ప్రేమించి విఫలమైన కారణంగా సూసైడ్ చేసుకున్నారని అంటారు. కానీ కేవలం 35 ఏళ్లకే చనిపోయిన సిల్క్ స్మిత.. తెరపై కనిపించేదంతా అబద్ధమని తన చావు మాత్రమే నిజమనే సంకేతాన్నిచ్చి జీవితాన్ని విషాదాంతం చేసుకుంది. ఆమె జీవితం ఆధారంగా 'డర్టీ పిక్చర్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో పాటు టైటిల్ రోల్ పోషించిన విద్యా బాలన్ కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మళ్లీ సిల్క్ స్మిత జీవిత చరిత్రపై సినిమా రాబోతోందని తెలుస్తోంది.
తమిళ దర్శకుడు కేఎస్ మణికందన్ సిల్క్ స్మిత జీవిత కథతో సినిమా తీయడానికి సన్నాహకాలు చేస్తున్నాడు. కమెడియన్ సంతానం తో ఫస్ట్ సినిమా చేసిన మణికందన్.. తన రెండో ప్రాజెక్ట్‌గా సిల్క్ స్మితను ఎంచుకున్నాడు. ఈ బయోపిక్ కి ''అవల్ అప్పడితన్'' అనే పేరును కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. మణికందన్ సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు ఆమెలోని ఆ హాట్ నెస్ ను మ్యాచ్ చేసే వాళ్లు ఎవ్వరూ పుట్టలేదు. ఆమె పాత్రకు న్యాయం చేసే నటి కోసం మేమంతా వెతుకుతున్నామ'ని చెప్పుకొచ్చాడు. మరి సిల్క్ స్మిత పాత్రకు ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.