Begin typing your search above and press return to search.
బన్నీతో లింగుస్వామి సెట్ అవ్వలేదనేసిన డైరెక్టర్!
By: Tupaki Desk | 8 July 2022 12:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా కోలీవుడ్ స్టార్ మేకర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుం దని చాలా కాలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ తో లింగు తెరకెక్కిస్తోన్న వారియర్ ముందు నుంచే లింగు స్వామి బన్నీ రేసు లో ఉన్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ స్ర్కిప్ట్ కూడా లాక్ అయిందని...ఆన్ సెట్స్ కి వెళ్లడమే ఆలస్యమని బలమైన ప్రచారమే సాగింది.
ఈ వార్తల్ని అల్లు కాంపౌండ్ కూడా ఏనాడు ఖండించలేదు. దీంతో కాంబినేషన్ పక్కా అనుకున్ని బన్నీ అభిమానులు నమ్మారు. బన్నీ లాంటి ఎనర్జిటిక్ హీరోకి సరైన యాక్షన్ మేకర్ దొరికితే ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అంచనాలు స్కైని టచ్ చేసాయి. గీతా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని అంతే ధీటుగా ప్రచారం సాగింది.
తాజాగా చెన్నై లో జరిగిన వారియర్ వేదికగా వీటన్నింటిపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. బన్నీకి లింగు స్వామి స్టోరీ చె ప్పడం నిజమే. స్టోరీ నచ్చితే ఆ చిత్రాన్ని గీతా ఆర్స్ట్ ఎన్ని కోట్లు అయినా ఖర్చుతోనైనా నిర్మించాలని బలంగా సంకల్పించింది వాస్తవమే. కానీ లింగుస్వామికి అది ఇప్పట్లో సాద్యమయ్యే పని కాదని తాజాగా ఆయన మాటల్లోనే తేలిపోయింది.
''బన్నీతో సినిమా చేయాలనుకున్నాను. కథ కూడా చెప్పాను . కానీ ఎందుకనో కుదరలేదు. అలాగే సూపర్ స్టార్ మహేష్ తో కూడా చేయాలని ఆయన్ని అప్రోచ్ అయ్యాను. ఆయన కూడా తన కథకి'' నో చెప్పినట్లు లింగుస్వామి రివీల్ చేసారు. మా కాంబినేషన్స్ ఎందుకు సెట్ కాలేదో తెలియదు. కానీ ఇప్పట్లో అది జరిగేలా లేదని లింగు స్వామి హింట్ ఇచ్చారు.
ఆయన మాటల్ని బట్టి స్ర్కిప్ట్ దగ్గరే లింగు స్వామికి ఆ ఇద్దరు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మహేష్ సంగతి పక్కన బెడితే బన్నీనే లింగు స్వామిని ఎక్కువగా డిజప్పాయిం ట్ చేసినట్లు కనిపిస్తుంది. ముందుగా లింగుస్వామి బన్నీ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే కథ రాసి అప్రోచ్ అయి వినిపించి ఉంటారు. బన్నీ రిజెక్ట్ చేయడం తో అదే కథతో మహేష్ ని అప్రోచ్ అయి ఉండొచ్చు.
ఆయనకి కూడా కథ నచ్చకపోవడంతో నో చెప్పి ఉండొచ్చని తెలుస్తోంది. ఆ ఇద్దరు రిజెక్ట్ చేసిన తర్వాత రామ్ వారియర్ స్టోరీతో లాక్ చేసి పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఈవారియర్ కథనే ఆ ఇద్దరికి చెప్పారా? లేక ఇది ప్రెష్ స్టోరీనా? అన్నది ఇంకా బయటకు రాలేదు. వారియర్ పై ఇప్పటికే భారీ అంచనాలు కొన్నాయి.
సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ సైన్ కనిపిస్తుంది. ఈ సినిమాతో రామ్ కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. హిట్ కొడితే గనుక ఆ ఇద్దరు డిజప్పాయింట్ అవ్వక తప్పదు. వారియర్ సక్సెస్ అయితే ఆ ఇద్దరు పరిగెట్టుకుని మరీ వస్తారు. లింగుస్వామికి యాక్షన్ మేకర్ గా మంచి పేరున్న సంగతి తెలిసిందే.