Begin typing your search above and press return to search.
లొకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్స్ కి రివర్స్ మాస్టర్
By: Tupaki Desk | 25 March 2022 2:30 AM GMTనలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో..నరు లెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో... `టక్కరి దొంగ` చిత్రంలో మహేష్ బాబు పాత్రని పరిచయం చేసే క్రమంలో వచ్చే పాట ఇది. గేయ రచయిత చంద్రబోస్ ఏ టైమ్ లో ఈ పాట రాసారో కానీ ఈ పాటలోని అక్షరాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్. క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన అంథాలజీ `అవియల్`లోని `కాలం`ని రూపొందించి ప్రశంసలు అందుకున్న లోకేష్ కనగరాజ్ `మా నగరం` చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
తొలి చిత్రంతో ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ మూవీ తరువాత అందరు నడిచిన దారిలో నడిస్తే మన గొప్పేంటి అనుకున్నాడో ఏమో అత్యంత క్లిష్టమైన టాస్క్ ని ఎంచుకుని సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మన స్టార్ డైరెక్టర్ రాజమౌళి `బాహుబలి` చిత్రానికి రెండు భాగాలు చేసిన విషయం తెలిసిందే. ముందు ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేసి ఆ తరువాత అంతకు మించిన క్రేజ్ ఏర్పడటంతో` బాహుబలి 2` ని తెరకెక్కించారు. ఈ రెండు పార్ట్ లు వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా స్థాయిని పెంచాయి.
ఇక ఇటీవల ఇదే ఫార్మాలాని ఫాలో అవుతూ సుకుమార్ `పుష్ప` చిత్రాన్ని తెరకెక్కించారు. ముందు నుంచే దీన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేయని సుకుమార్ సినిమా మధ్యలోకి వచ్చేసరికి రెండు పార్ట్ లుగా చేయాలని ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బన్నీని పాన్ ఇండియా స్టార్ గా మార్చడంతో పార్ట్ 2కి రెడీ అయిపోతున్నాడు.
ఈ మూవీకి ముందే ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్`ని రెండు భాగాలుగా తీయబోతున్నానంటూ తొలి పార్ట్ రిలీజ్ ముందే చెప్పేశాడు. పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 ని మరింత పవర్ ఫుల్ గా తెరకెక్కించాడు. ఏప్రిల్ 14న పార్ట్ 2 విడుదలకు రెడీ అయిపోతోంది. ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్ల తీరు ఇలా వుంటే లోకేష్ కనగరాజ్ తీరు మాత్రం ఇందుకు రివర్స్ లో వుంది. ఎవరైనా ముందు ఫస్ట్ పార్ట్ ని తీశాక సెకండ్ పార్ట్ ని తీస్తారు. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం అలా చేయకుండా సెకండ్ పార్ట్ ని ముందు చేసి ఆ తరువాతే ఫస్ట్ పార్ట్ ని అంటే ప్రీక్వెల్ ని చేస్తున్నారు.
కార్తీతో లోకేష్ కనగరాజ్ చేసిన చిత్రం `ఖైదీ`. ఇందులో హీరోయిన్ వుండదు. తనకి సంబంధించిన కథే వుండదు. కానీ హీరోకు మాత్రం ఓ కూతురు వుంటుంది. తనని కాపాడటానికి హీరో పోలీసులకు సహాయం చేసే క్రమంలో అతని వెనక పెద్ద కథే వుందని, ఆ కథకు ప్రస్తుత కథలో పోలీసుల్ని టార్గెట్ చేసిన గ్యాంగ్ స్టర్లకు సంబంధం వుందని దాన్ని ప్రీక్వెల్ లో చూపించబోతున్నట్టుగా లాకప్ లో వున్న హరీష్ ఉత్తమన్ పాత్రలో హింట్ ఇచ్చాడు లొకేష్ కనగరాజ్. అంటే `ఖైదీ`కి ప్రీక్వెల్ వుందన్న మాట.
ఇక విజయ్ తో చేసిన `మాస్టర్` పరిస్థితి కూడా అంతే. ఇందులో హీరో విజయ్ ఎప్పుడూ ఏదో పోగొట్టుకుని డ్రంకెడిక్ట్ గా కనిపిస్తాడు. పక్కన మాళవిక మోహనన్ వంటి హీరోయిన్ వున్నా.. తనకి విజయ్ కి మధ్య ఎలాంటి డ్యూయెట్ లు కానీ ప్రత్యేకించి సీన్ లు కానీ వుండవు. ఏంటీ కథ అంటే అది వేరే వుందిలే అని హీరో విజయ్ పాత్ర చేత చెప్పించాడు లోకేష్ కనగరాజ్ అంటే `మాస్టర్`కి కూడా ప్రీక్వెల్ వుందన్నమాట. మన వాళ్లు సీక్వెల్స్ చేస్తుంటే లోకేష్ కనగరాజ్ మాత్రం ప్రీక్వెల్స్ తో అదరగొట్టడానికి రెడీ అయిపోతుండటం విశేషం. అందుకే అతన్ని అంతా రివర్స్ మాస్టర్ అంటున్నారు.