Begin typing your search above and press return to search.
200 కోట్ల తో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్
By: Tupaki Desk | 9 Dec 2018 4:47 AM GMTకల్కీ కృష్ణ మూర్తి రాసిన ఫేమస్ హిస్టారికల్ నవల `పొన్నీయిన్ సెల్వన్`. ఈ చారిత్రాత్మక కాల్పని క కథ ని తెర పైకి తీసుకురావాలన్న మణిరత్నం కల. ఎన్ని సార్లు ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. గత కొన్నేళ్ల క్రితం ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో తన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పై ఈ చారిత్రక కథను వెండి తెర పై ఆవిష్కరించాలని మణిరత్నం చాలా ప్రయత్నాలే చేశాడు. చివరి నిమిషంలో ఫైనాన్షియర్ లు మణిరత్నంను నమ్మి భారీ మొత్తాన్ని సినిమా కోసం ఖర్చుచేయడానికి జంకడంతో మణిరత్నం కలల ప్రాజెక్ట్ ఆరంభ దశలో నే ఆగిపోయింది. దీన్ని ఎప్పటికైనా భారతీయ సినీ ప్రేక్షకులకు చూపించాలని కలలుగన్న ఆయన కు `బాహుబలి` కొత్త దారిని చూపించింది.
`బాహుబలి` సినిమా తరువాత భారతీయ సినీమా మార్కెట్ విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత దక్షిణాది నుంచి సినిమా వస్తోందంటే ప్రపంచం మొత్తం ఆసక్తి గా ఎదురుచూస్తోంది. ఇదే మణిరత్నంను మళ్లీ `పొన్నీయిన్ సెల్వన్` వైపు నడిచేలా చేసింది. గతంలో ఈ చిత్రాన్ని మహేష్ తో తెరకెక్కించాలని విశ్వప్రయత్నాలు చేశాడు. అదీ కుదరకపోతే విజయ్- అజిత్- జయం రవి- లేదా విక్రమ్ తో దీన్ని తెర పైకి తీసుకురావాలనుకున్నాడు. దక్షిణాది సినిమా మార్కెట్ పరిధి పెరగడంతో మళ్లీ `పొన్నీయిన్ సెల్వన్`ని తెర పైకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందు కోసం ఇప్పటి కే ఈ సినిమా కోసం హీరో విక్రమ్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పోతే ఈ చిత్రాని కి దాదాపు 200-300 కోట్ల మేర ఖర్చు చేయనున్నారన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.
వరుస వైఫల్యాలతో కెరీర్ పరంగా వెనకపడ్డ విక్రమ్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో రూపొందుతున్న `మహావీర్ కర్ణ` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవలే మొదలైంది. ఇది పూర్తయిన తరువాతే `పొన్నీయిన్ సెల్వన్` ని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో మణిరత్నం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా తన కలల ప్రాజెక్ట్‌ను తెర పైకి తీసుకురావాలనుకుంటున్న మణిరత్నం కల ఈ సారైనా నెరవేరుతుందో లేదో చూడాలి అంటున్నారు తమిళ సినీ విశ్లేషకులు.