Begin typing your search above and press return to search.

అఖిల్ ని మారుతి కెలుకుతున్నాడా?

By:  Tupaki Desk   |   4 Nov 2022 4:30 AM GMT
అఖిల్ ని మారుతి కెలుకుతున్నాడా?
X
అక్కినేని వార‌సుడు అఖిల్ వేగం పుంజుకున్న సంగ‌తి తెలిసిందే. `మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్ ల‌ర్` తో సిస‌లైన స‌క్సెస్ని ఖాతాలో వేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ప్ర‌స్తుతం స్టైలిష్ మేక‌ర్ సురేంద‌ర్ రెడ్డితో `ఏజెంట్` లో నటిస్తున్నాడు. స్పై థ్రిల్ల‌ర్ పై అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన అఖిల్ మేకోవ‌ర్.. లుక్ స‌హా ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొస్తున్నాయి.

పాజిటివ్ బ‌జ్ నేప‌థ్యంలో అఖిల్ మ‌రో స‌క్సెస్ కొట్టేలానే క‌నిపిస్తున్నాడు. ఈ నేప‌థ్యం లో అఖిల్ పై డైరెక్ట‌ర్లు ముందొస్తుగా క‌ర్చీప్ వేసే ప్లాన్ లో ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. అందులో ముందుగా మారుతి పేరు తెర‌పైకి వ‌స్తుంది. ఇటీవ‌లే మారుతి అఖిల్ కి ట‌చ్ లోకి వెళ్లాడు. ప్రెండ్లీగా క‌లిసాడా? లేక స్ర్కిప్ట్ తో క‌లిసాడా? అన్న‌ది క్లారిటీ లేదుగానీ..అఖిల్ ని మాత్రం మీట్ అయిన‌ట్లు వినిపిస్తుంది.

మ‌రి ఆ సంగ‌తేంటి? అన్న‌ది తేలాల్సి ఉంది. ఇలా హీరోల‌తో స‌మావేశం అవ్వ‌డం మారుతికి చాలా కాలంగా ఉన్న అల‌వాటే. ఆ మ‌ధ్య బ‌న్నీతో సినిమాలో చేయాలని చాలా ప్ర‌య‌త్నాలు చేసారు. కానీ ఆయ‌న స్ర్కిప్ట్ ప‌రంగా సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో ఆ కాంబో సాధ్యం కాలేదు. అలాగే సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి సైతం మారుతిని క‌థ సిద్దం చేసుకోమ‌న్నారు.

మారుతిని మెగాస్టారే విశ్వ‌సించ‌డంతో ఆయ‌న రేంజ్ రెట్టింపు అయింది. ప్ర‌స్తుతం మారుతి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో `డీల‌క్స్ రాజా` తెర‌కెక్కిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. మారుతి కెరీర్ లోనే ఇది బిగ్ ఛాన్స్. కొంత‌ మంది హీరోలు మారుతిని న‌మ్మకపోయినా న‌మ్మి అవ‌కాశం క‌ల్పించిన ఏకైక స్టార్ ప్ర‌భాస్. ఈ ఛాన్స్ మారుతికి ఓ ట‌ర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు.

ఇంత వ‌ర‌కూ మారుతి టాప్ స్టార్ల‌ని డైరెక్ట్ చేయ‌లేదు. మీడియం రేంజ్ హీరోల‌తోనే ప‌నిచేసాడు. తొలిసారి పాన్ ఇండియా స్టార్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఈ ఛాన్స్ ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల్గితే గ‌నుక మారుతి రేంజ్ మారిపోతుంది. ఒక్క హిట్ తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిపోతాడు. మ‌రి మారుతి ఎలాంటి స్ర్టాట‌జీతో ముందుకెళ్తున్నారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.