Begin typing your search above and press return to search.
మారుతి లైఫ్ లో ఈ కిక్ గురించి విన్నారా?
By: Tupaki Desk | 15 Oct 2016 11:30 AM GMTకష్టపడకుండా వచ్చే దానిపై ఆశపడకు - కష్టపడకుండా వచ్చేది ఎప్పటికీ నిలవదు - కష్టపడి సంపాదించింది ఎప్పటికీ పోదు... రజనీకాంత్ సినిమాలో డైలాగులా అనిపించినా ఇది వాస్తవమనేది అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారంతా లాటరీలు కొట్టి పైకొచ్చినవారు కాదు - ఎంతో కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుకుంటూ, నిర్ధేశించుకున్న గమ్యాన్ని ఎంచుకున్న మార్గాన్ని ప్రేమిస్తూ పైకొచ్చినవారు. వారిలో యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కూడా ఒకరు. థియేటర్ పక్కనున్న స్టిక్కరింగ్ షాపులో పనిచేస్తూ.. ఆ థియేటర్ లో బోర్డులు - స్టిక్కరింగ్ పనులు ఏమైనా ఉంటే యజమాని పిలుపు మేరకు వెళ్లి చేసే ఒక వ్యక్తి ఆల్ట్రేషన్ అనంతరం అదే థియేటర్ ఓపెనింగ్ ముఖ్య అతిధిగా వెళ్తే... ఆసమయంలో ఆ కుర్రాడు పొందే కిక్కు - ఆ థియేటర్ యజమానికి ఆశ్చర్యం - ఆనందం కలగలిపి తగిలే షాక్ భలేగా ఉంటాయి కదా. ఆ సంగతులు వివరంగా తెలుసుకోవాలంటే...
పదిహేనేళ్ల క్రితం బందరులోని సిరి వెంకట్ - కృష్ణ కిషోర్ థియేటర్ పక్కనే ఉన్న చిన్న స్టిక్కరింగ్ షాప్ లో పనిచేసేవాడు నేటి యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి. అప్పుడప్పుడు ఆ థియేటర్ లో బోర్డులు - స్టిక్కరింగ్ పనులు ఏమైనా ఉంటే ఓనర్ ఈ కుర్రాణ్నే పిలిచేవాడు. ఆ పిలుపుకోసం ఈ కుర్రాడు ఆశగా ఎదురుచూసేవాడు. ఎందుకంటే మనోడికి సినిమా అంటే పిచ్చి కాదు అంతకు మించి కాబట్టి. కట్ చేస్తే... పదిహేనేళ్ల తర్వాత అల్లు అరవింద్ - దిల్ రాజు - యువీ క్రియేషన్స్ ఒక సంస్థగా ఏర్పడి బందరులో అదే థియేటర్ ను అద్దెకు తీసుకుని రీమోడల్ చేశారు. ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టిన రోజు వారితో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తిని చూసి ఆ థియేటర్ ఓనర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ ముఖ్య అతిథి ఎవరో కాదు... అప్పట్లో అదే థియేటర్ లోనే చిన్న చిన్న పనులు చేసిన కుర్రాడు మారుతి. దాంతో ఒకపక్క ఆనందం - మరో పక్క ఆశ్చర్యం కలగలిపిన షాకి గురయ్యాడు ఆ యజమాని. ఆ సమయంలో మారుతి అనుభవించిన కిక్ ఎలా ఉండి ఉంటుందంటారు? లైఫ్ లో ఆమాత్రం కిక్ లేకపోతే ఏమి బాగుంటుంది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/