Begin typing your search above and press return to search.
దేశ రహస్యాలు 'చౌక' బేరానికి!
By: Tupaki Desk | 5 Oct 2018 5:05 AM GMTచిన్న సినిమాల కాన్సెప్ట్ లు బావున్నా జనం థియేటర్ వరకూ రారు. సినిమాలు చూడాలి అంటే అందులో ఏదో సమ్ థింగ్ డిఫరెంట్ గా వుండాలి. అలాంటి డిఫరెంట్ పాయింట్ తో వరూ ఊహించని రీతిలో వుంటుంది మా సినిమా అని అన్నారు మారుతి దాసరి. తప్పక చూడాల్సిన సినిమా `భలే మంచి చౌకబేరము` అని తెలిపారు. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సందర్భంగా మారుతి సినిమా గురించిన పలు ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించారు.
కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ఇది. నా ఐడియాని రవి పూర్తి స్క్రిప్ట్ గా మలిచి డైలాగులు రాసుకున్నారు. `రోజులు మారాయి` టీమ్ తిరిగి కలిసి ఈ సినిమా చేశారు. మురళి డైరెక్టర్ - బాల్ రెడ్డి కెమెరా - జె.బి. మ్యూజిక్ అంతా బాగా శ్రమించి తీశారు. కథ నచ్చి ఈ టీమ్ తో ఆరోళ్ళ గ్రూప్ సతీష్ జాయిన్ అయ్యారు. కథలో అంతగా నచ్చటానికి ఏం ఉంది? అంటే .. కృష్ణానగర్ లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్స్ కి దేశ రహస్యాలకు సంబంధించిన ఒక సీక్రెట్ కవర్ దొరుకుతుంది. వాళ్ళు దానిని ఎలా బేరానికి పెట్టారు? అన్నదే ప్రధాన కాన్సెప్ట్. ఆద్యంతం వినోదం పంచుతూ ఇంటర్వెల్ ట్విస్టుతో సినిమా పీక్స్ కి చేరుతుంది. ద్వితీయార్థం సీరియస్ గా సాగుతున్నా.. కన్ఫ్యూజన్ కామెడీ ఆకట్టుకుంటుంది`` అని తెలిపారు.
నవీద్ - పార్వతీశం - యామిని భాస్కర్ అంతా మన తెలుగు నటీనటులతో తీసిన చిత్రమిది. రాజా రవీంద్ర పాత్ర సర్ ప్రైజ్. అతడి రోల్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా వుంటుంది. ముస్తఫా అనే కొత్త విలన్ పరిచయం అవుతున్నారు... అని తెలిపారు. భలే భలే మగాడివోయ్ - మహానుభావుడు .. ఇవన్నీ మారుతి క్రియేటివిటీలోని కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు. ఇప్పుడు కూడా అదే తరహాలో కాన్సెప్ట్ వర్కవుటైతే .. దేశరహస్యాల్ని లీక్ చేసే కృష్ణానగర్ బ్యాచ్ జనాలకు కనెక్టయితే హిట్టొచ్చే ఛాన్సుందన్నమాట!!