Begin typing your search above and press return to search.
మూడేళ్ల నుంచి బన్నీ కోసం ట్రయల్స్..పని మాత్రం కాలేదు!
By: Tupaki Desk | 27 April 2020 1:30 AM GMTకొంత మంది డైరెక్టర్లకు మొదటి సినిమాతోనే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అదృష్టం దక్కుతుంది కొంతమంది రెండో సినిమా.. మూడో సినిమాతోనే స్టార్ హీరోల డైరెక్ట్ చేస్తారు. అయితే కొందరికి మాత్రం ఎంత ఎక్స్ పీరియన్స్ ఉన్నా.. ఎన్ని సినిమాలు చేసినా.. సక్సెస్ ఉన్నా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కలేదు. మారుతి పరిస్థితి కూడా దాదాపుగా అంతే. దాదాపు మూడేళ్ల నుంచి మారుతి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ ఆ శుభ తరుణం మాత్రం రాలేదు.
'మహానుభావుడు' సినిమా తర్వాత ఎవరైనా స్టార్ హీరోతో సినిమా చేద్దామనే ఉద్దేశంతో మారుతి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ సమయంలో బన్నీకి 'ప్రతిరోజు పండగే' కథను వినిపించాడు. బన్నీ కూడా కథలో కొన్ని మార్పులు చేర్పులు సూచించాడట. ఆ సమయంలో బన్నీ 'నా పేరు సూర్య' సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే బన్నీతో సినిమా ఫిక్స్ అని మారుతి అనుకున్నాడు. అయితే మారుతికి అదృష్టం కలిసి రాకపోవడంతో 'నా పేరు సూర్య' ఫ్లాప్ గా నిలిచింది. ఈ మధ్యకాలంలో బన్నీకి అలాంటివి ఫ్లాప్ ఎప్పుడూ తగల్లేదు. దీంతో అల్లు క్యాంప్ డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ లో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. మారుతి సినిమాను మరో హీరోతో జీఏ2 బ్యానర్లో సెట్ చేశారు. దానికి కూడా మారుతి చాలా కష్టపడి సాయి ధరమ్ తేజ్ ను ఒప్పించాలని వచ్చిందట.
'ప్రతి రోజూ పండగే' తర్వాత జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో మారుతికి మరో కమిట్మెంట్ ఉంది. ఆ డీల్ ప్రకారమే మారుతి ఒక ఫ్యామిలీ స్టోరీని రెడీ చేసుకున్నాడట. ఈ సినిమాను బన్నీతో చేయాలని మారుతికి మనసులో ఉందట.. కానీ అల్లు క్యాంప్ మాత్రం ఈ ప్రాజెక్టును నానితో ఫిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ కు ప్రస్తుతం సుకుమార్ సినిమా లైన్ లో ఉంది. కనీసం మూడేళ్ళ వరకు అల్లుఅర్జున్ కాల్షీట్స్ అందుబాటులో లేవని అంటున్నారు. ఈ లెక్కన మారుతి వెయిటింగ్ పీరియడ్ మరింత గా పెరిగినట్టే.