Begin typing your search above and press return to search.

దర్శకుడి మారుతి లైఫ్ లో రీల్ సీన్ మాదిరే రియల్ సీన్

By:  Tupaki Desk   |   25 Dec 2019 11:08 AM IST
దర్శకుడి మారుతి లైఫ్ లో రీల్ సీన్ మాదిరే రియల్ సీన్
X
రీల్ లో మాత్రమే కనిపించే కొన్ని సీన్లు రియల్ గా కూడా జరుగుతాయి. కానీ.. అవి బయటకు రావు. విజయాన్ని సొంతం చేసుకొని సెలబ్రిటీలుగా మారి.. ఏదైనా ఇంటర్వ్యూలో మనసు విప్పినప్పుడు కానీ అసలు విషయాలు బయటకు రావు. తన జీవితంలో జరిగిన ఇలాంటి విషయాన్ని బయటపెట్టారు దర్శకుడు మారుతి.

చాలా తక్కువమంది కొడుకులు మాత్రమే తమ తండ్రికి ఇచ్చే బహుమతిని దర్శకుడు మారుతి ఇచ్చారని చెప్పాలి. ఒక ప్రముఖ చానల్ లో ప్రసారమయ్యే ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా మారుతి చెప్పిన ఈ ఆసక్తికర విషయాన్ని ఆయన మాటల్లోనే వింటే.. ఆ ఎఫెక్ట్ మరింత బాగుంటుందని చెప్పాలి. ఇంతకూ తన తండ్రికి మారుతి ఇచ్చిన అపురూపమైన బహుమతి గురించి నటుడు ఆలీ చెప్పటం మరింత ఆసక్తికరమని చెప్పాలి.

మచిలీపట్నంలో రాధిక థియేటర్ ఉండేదని.. అప్పట్లో దాని ఓనర్ వస్తుంటే మారుతి తండ్రి వెళ్లి గేట్ తీసేశారని.. తర్వాత మారుతి డైరెక్టర్ అయ్యాక మారుతి వాళ్ల నాన్న వస్తుంటే ఓనర్ వచ్చి గేటు తీస్తున్నట్లుగా చెప్పారు. దీనికి ఒద్దికగా మారుతి రియాక్ట్ కావటం ఆసక్తికరంగా.

అదేం కాదులెండి.. కొన్నాళ్లకు ఆ థియేటర్ మూసేశారు. చిన్నప్పుడు రెండు అరటిపళ్లు ఇస్తే ఫస్టాప్ అయిపోయిన తర్వాత లోపలకు పంపేవాళ్లు. ఒక థియేటర్ కు వెళ్లి తాను స్టిక్కరింగ్ చేసేవాడినని.. తర్వాత అదే థియేటర్ ను గీతా ఆర్ట్స్ వాళ్లు తీసుకుంటే దానికి తాను చీఫ్ గెస్ట్ గా వెళ్లానని.. అది తన అచీవ్ మెంట్ గా చెప్పారు. ఎదిగిన తర్వాత కూడా ఒదిగినట్లుగా ఉన్న మారుతి మాటలు చూస్తే.. సక్సెస్ అతడికి ఎందుకు దరి చేరుతుందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.