Begin typing your search above and press return to search.
'గాడ్ ఫాదర్', 'లూసిఫర్' మధ్య తేడా ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 4 Oct 2022 10:30 AM GMTమలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన'లూసిఫర్' చిత్రం ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది. అయితే తాజాగా దర్శకుడు మోహన్ రాజా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే'లూసిఫర్','గాడ్ ఫాదర్' చిత్రాలకు మధ్య ఉన్న తేడాను కూడా ఆయన వివరించారు.
మోహన్ రాజా మాట్లాడుతూ.. లూసిఫర్ కొంత నెమ్మదైన కథనం కాగా గాడ్ ఫాదర్ వేగంగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని పేర్కొన్నారు.
అలాగే లూసిఫర్ లో లేని ఒక కొత్త కోణం గాడ్ ఫాదర్ లో ఉంటుందని, ఆ కొత్త కోణం చిరంజీవి గారికి చాలా బాగా నచ్చిందని మోహన్ రాజా తెలిపారు. కథను అలాగే ఉంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాను రూపొందించామని, ఇందులోని ఓ పది పాత్రలు ఎంతో సర్ ప్రైజింగ్‌గా ఉంటాయని ఆయన వివరించారు.
అంతేకాదు, లూసీఫర్ చూసి వచ్చినా తనకేం భయం లేదని, లూసిఫర్ చూసిన వాళ్ళకు కూడా గాడ్ ఫాదర్ కొత్తగా అనిపిస్తుందని మోహన్ రాజా తెలిపారు. పైగా'గాడ్ ఫాదర్' మూవీతో చిరంజీవికి ఓ మంచి హిట్ ఇవ్వబోతుండటం హ్యాపీ గా ఉందంటూ ధీమా కూడా వ్యక్తం చేశారు.
మొత్తానికి మోహన్ రాజా కామెంట్స్ తో మోగా అభిమానుల్లో మరింత ధైర్యం పెరిగింది. మరి ఆయన చెప్పినట్లు'గాడ్ ఫాదర్' ప్రేక్షకులకు ఓ కొత్త ఫీలింగ్ ను ఇస్తే.. ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద చిరంజీవి దుమ్ము దులపడం ఖాయమవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.