Begin typing your search above and press return to search.
కొంచెం ఆగి పైరసి చేసుకోండి.. ప్లీజ్
By: Tupaki Desk | 22 Dec 2017 6:21 PM GMTప్రతి సినిమా ఇండస్ట్రీలో పైరసి రాకాసి సంచరిస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ రాకాసిని పట్టుకోవడాని ఎవరు ఎన్ని మంత్రాలు చేసినా దేవుళ్ల స్తోత్రాలు పటించినా రాకాసి పైరసి ఏ మాత్రం భయపడకుండా తన పని తాను చక్కగా చేసుకుంటూ పోతోంది. అయితే అన్ని ఇండస్ట్రీలలో పైరసి వల్ల నష్టాలు భారీగా ఉన్నాయని చెప్పలేము గాని కోలీవుడ్ సినిమాలు మాత్రం భారీగా నష్టాలను చూడాల్సి వస్తోంది. ఈ మధ్య కాలంలో అక్కడ తమిళ రాకర్స్ అనే ఒక వెబ్ సైట్ పైరేసి చేసి మొదటి మొదటి షో తర్వాత ఆన్ లైన్ లో పెడుతున్నారు.
అయితే వాటిపై చర్యలు తీసుకోవడానికి తమిళ్ సినీ పెద్దలు చేయని ప్రయత్నం లేదు. పైరసిలను ఎంత అరికట్టినా మళ్లీ నెక్స్ట్ రోజే మరిన్ని పైరసి సీడీలు దర్శనం ఇస్తున్నాయి. అంతే కాకుండా ఆన్ లైన్ లో చూడటం అందరికి అలవాటు అయిపోయింది. అయితే ఈ తరహా ఇబ్బందులు తన సినిమాకు రాకూడదని ఒక స్టార్ డైరెక్టర్ తమిళ రాకర్స్ ని వేసుకున్న తీరును చూస్తే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తని ఒరువన్ (తెలుగులో ధృవ ) అనే సినిమాను తెరకెక్కించి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు మోహన్ రాజా. అయితే అతను ఆ సినిమా తర్వాత చాలా టైమ్ తీసుకొని వేలైక్కారన్’ (పనివాడు అని అర్థం) అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోన్న సందర్భంగా దర్శకుడు ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
పైరసి సంస్థ గురించి మాట్లాడుతూ.. తమిళ్ రాకర్స్ చాలా పేరుపొందిన ఒక వెబ్ సైట్. అయితే ఈ సినిమా కథ ప్రపంచంలో కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి గురించి తీసిన సినిమా. తమిళ్ రాకర్స్ వారు కూడా చాలా కష్టపడతారు. వారు చాలా గొప్పవారని పొగుడుతూ.. ఈ ఒక్కసారి కొంచెం ఆలస్యంగా వెబ్ సైట్లో అప్ లోడ్ చేయమని మోహన్ తెలిపారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అంతే కాకుండా తమిళ్ చిత్ర పరిశ్రమ ఏ పరిస్థితుల్లో ఉందో అర్ధమవుతోందని ఇతర పరిశ్రమ ప్రముఖులు జాలి పడుతున్నారు.