Begin typing your search above and press return to search.
విశాల్ తో మిస్కిన్ పేచీ తేలేట్టు లేదు
By: Tupaki Desk | 14 March 2020 8:03 AM GMTదర్శకుడు మిస్కిన్ తో విశాల్ కాంట్రవర్శీ తెలిసిందే. అభిమన్యుడు 2 (తుప్పరివాలన్ 2) బడ్జెట్ల విషయమై క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడంతో ఆ ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. ముందే చెప్పిన బడ్జెట్ కంటే 40 కోట్లు అదనంగా ఖర్చవుతుందని మిస్కిన్ అనడంతో అసలు వివాదం మొదలైంది. ఆ గొడవ కాస్త దపదఫాలు గా వేడెక్కిస్తూనే ఉంది. ఇక మిస్కిన్ ని తప్పించి విశాల్ కెప్టెన్ సీటును తనపరం చేసుకోవడం అగ్నికి ఆజ్యం పోసింది.
అనంతరం మిస్కిన్ రకరకాల డిమాండ్లు చేయడం తెలిసిందే. తనకు రావాల్సిన పారితోషికం విషయంలోనూ మిస్కిన్ క్లారిటీగా పట్టుబడుతున్నాడు. ఇప్పటికీ ఆ గొడవ కొనసాగుతూనే ఉంది. స్క్రిప్టు కోసం ఖర్చు చేసిన పారితోషికాల విషయంలోనూ ప్రస్తుతం వివాదం నడుస్తోంది. కేవలం స్క్రిప్టు కోసమే 35లక్షల మేర ఖర్చు చేశామని విశాల్ చెబుతుంటే.. అదంతా అబద్ధం అని మిస్కిన్ వాదిస్తున్నారు. కేవలం 8 లక్షలు లోపు ఖర్చు చేశారని మిస్కిన్ వాదించారు. ఇక తెలిసో తెలియకో తాను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేయడంతో విశాల్ ఆటలు సాగుతున్నాయని .. దానివల్లనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసుకునే వెసులుబాటు కలిగిందని మిస్కిన్ అంటున్నాడు.
ఇక ఇప్పటికే అభిమన్యుడు 2 చిత్రాన్ని 32 రోజుల పాటు చిత్రీకరించారు. అయితే దానికోసం 13కోట్లు ఖర్చయ్యిందని విశాల్ చెబుతున్నారు. దానికి ప్రూఫ్ లేనేలేదని మిస్కిన్ వాదిస్తున్నారు. మొత్తానికి బడ్జెట్ సహా రకరకాల విషయాల్లో డిఫరెన్సెస్ పై చర్చ సాగుతోంది. ఇకపై దర్శకత్వంలో మిస్కిన్ ప్రమేయం ఉండదు కాబట్టి విశాల్ ఇతర వివాదాల్ని పరిష్కరించుకునే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న విశాల్ తో తాను అంటకాగడం తప్పేనని మిస్కిన్ ఓ వ్యాఖ్యను చేయడం వేడెక్కించింది. మొత్తానికి దర్శఖ హీరోల మధ్య డిస్ట్రబెన్సెస్ ప్రభావం సినిమా కంటెంట్ పై పడితే పరిస్థితేంటి? అన్నది అభిమన్యుడు ఫ్రాంఛైజీ అభిమానుల్లో ఆందోళన. ఈ గొడవ ఇంతటితో సద్దుమణిగితే సంతోషమే.