Begin typing your search above and press return to search.

గ‌ర్భిణులు పిల్ల‌లు మా సినిమా చూడొద్దు

By:  Tupaki Desk   |   26 Jan 2020 4:50 AM GMT
గ‌ర్భిణులు పిల్ల‌లు మా సినిమా చూడొద్దు
X
థ్రిల్ల‌ర్ క‌థాంశాల స‌క్సెస్ రేటు అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. క‌థ‌లో ద‌మ్ము.. ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. కుర్చీ అంచున కూచోబెట్టే టెక్నిక్ స‌రిగ్గా కుదిరితే ఆ సినిమా హిట్టు కొట్టేస్తోంది. ఆ కోవ‌లోనే ఇంతకు ముందు ఓ త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రాక్ష‌సుడు పేరుతో తెలుగైజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా ర‌మేష్ వ‌ర్మ ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులో ఈ చిత్రం చ‌క్క‌ని విజ‌యం సాధించింది. బెల్లంకొండ‌కు న‌టుడిగానూ పేరు తెచ్చింది.

తాజాగా ఇప్పుడు మ‌రో సినిమా ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్ని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌ఖ్యాత త‌మిళ ద‌ర్శ‌కుడు మిస్కిన్ తెర‌కెక్కించిన సైకోపాథిక్ థ్రిల్ల‌ర్ మూవీ `సైకో` ఈ శుక్ర‌వారం రిలీజై బంప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ రేంజులో ఈ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కించార‌న్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో న‌టించిన నిత్యా మీన‌న్ - అదిథీరావ్ హైద‌రీ త‌దిత‌రుల న‌ట‌న‌పైనా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఉద‌యనిధి స్టాలిన్ కి సైకో రూపంలో చ‌క్క‌ని విజ‌యం ద‌క్కిన‌ట్టేన‌న్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఒక థ్రిల్ల‌ర్ క‌థాంశాన్ని ఎంతో ఇన్నోవేటివ్ గా గ్రిప్పింగ్ గా తెర‌కెక్కించిన మిస్కిన్ పై ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. స‌మీక్ష‌కులు అత‌డిని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.

అలాగే ఇళ‌య‌రాజా అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సంగీతం సినిమాకి ప్ల‌స్ అన్న టాక్ కూడా వినిపించింది. ఇదో సైకో సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థాంశం. క‌ళ్లు క‌నిపించ‌ని ఓ విక‌లాంగుడు త‌న ప్రియురాలిని సైకో బారి నుంచి ర‌క్షించుకునేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు? అన్నదే చిత్ర క‌థాంశం. ఈ సినిమాకి క‌థ‌- క‌థ‌నం మిస్కిన్ స్వ‌యంగా రాసుకుని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక 18 పైబ‌డిన వారు మాత్ర‌మే ఈ సినిమాని చూడాల‌ని .. గ‌ర్భిణులు .. పిల్ల‌లు థియేట‌ర్ల‌కు రావొద్ద‌ని స్ట్రిక్టుగా వార్నింగ్ ఇచ్చింది చిత్ర‌బృందం. మొత్తానికి ఇటీవ‌లి కాలంలో ఇంత‌గా టాక్ వ‌చ్చిన వేరొక త‌మిళ సినిమా లేనేలేద‌ని చెప్పాలి. మ‌రి ఈ చిత్రాన్ని తెలుగులో అనువ‌దిస్తారా? లేక రీమేక్ చేస్తారా? అన్న‌ది చూడాలి.