Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ తో కాశ్మీర్ ఫైల్స్ డైరెక్ట‌ర్?

By:  Tupaki Desk   |   3 Jan 2023 4:34 AM GMT
రామ్ చ‌ర‌ణ్ తో కాశ్మీర్ ఫైల్స్ డైరెక్ట‌ర్?
X
ఈ ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద‌ టాలీవుడ్ హ‌వా సాగింది. కానీ ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ మాత్ర‌మే! అని చెప్పుకునేవాళ్లంతా ఫ్లాపుల‌తో డీలా ప‌డిపోయారు. ఇలాంటి ప‌రాభ‌వ‌ స‌న్నివేశంలో సైతం ఒక డాక్యు సినిమా బాలీవుడ్ ని ఆదుకుంది. నిజ‌ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన 'కాశ్మీర్ ఫైల్స్' గురించే ఇదంతా. ఈ ఫీచ‌ర్ ఫిలింపై చాలా మంది డాక్యుమెంట‌రీ అని ముద్ర వేశారు. ఇది అస‌లు క‌మ‌ర్షియ‌ల్ సినిమా కానే కాదు అని విమ‌ర్శించారు. అస‌లు ఇందులో ఏం ఉంద‌ని.. ? 'కాశ్మీర్ పండితుల ఊచ‌కోత' అనే ఒక వివాదాన్ని తెలివిగా ప్ర‌చారం చేసుకుని వివేక్ అగ్నిహోత్రి ప్ర‌చార చిత్రం తీసి డ‌బ్బు సంపాదించాడ‌ని కూడా ఆరోపించారు. అయితే ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా విమ‌ర్శించినా భారీ బ‌డ్జెట్లతో తెర‌కెక్కిన స్టార్ హీరోల సినిమాల‌ను మించి ఈ డాక్యు సినిమా (డాక్యుమెంట‌రీ త‌ర‌హా సినిమా) ఘ‌న‌విజ‌యం అందుకుంది. అయితే ఈరోజుల్లో ప్ర‌జ‌ల‌కు ఏది న‌చ్చుతోందో ఏది న‌చ్చ‌దో ఎవ‌రూ చెప్ప‌లేర‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు-హీరోలే వ్యాఖ్యానిస్తున్నారు. అలాంట‌ప్పుడు ఏది విజ‌యం సాధిస్తుందో అది క‌మ‌ర్షియ‌ల్ సినిమాగానే భావించాలి. డాక్యు సినిమా తీసి క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస‌వ్వ‌డం ఇంకా చాలా గొప్ప‌.

బ‌హుశా అందుకేనేమో.. ఓ నెటిజ‌నుడితో డిబేట్ లో వివేక్ అగ్నిహోత్రితో రామ్ చ‌ర‌ణ్ సినిమా అన్న డిబేట్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఒక అప‌రిచిత‌ నెటిజన్ "హ్యాపీ న్యూ ఇయర్ సర్ (వివేక్) .. రామ్ చరణ్ తో మీ తదుపరి చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాను" అని అన్నారు. ప్రతిస్పందనగా.. వివేక్ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి" అని రిప్ల‌య్ గా ట్వీట్ చేసారు. దీంతో చ‌ర‌ణ్‌-వివేక్ అగ్నిహోత్రి సినిమాకి బీజాలు ప‌డిన‌ట్టేన‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

అయితే ఒక డాక్యు సినిమా తీసిన ద‌ర్శ‌కుడితో ఆర్.ఆర్.ఆర్ స్టార్ సినిమా చేయ‌డం క‌రెక్టేనా? త‌ప్పుడు నిర్ణ‌యం కాదా? అంటూ డిబేట్ కొన‌సాగుతోంది. వివేక్ అగ్నిహోత్రి డాక్యు సినిమాలు మాత్ర‌మే చేయ‌గ‌ల‌డు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌లేడు. రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా స్థాయి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు మాత్ర‌మే చేస్తాడు. అందువ‌ల్ల అగ్నిహోత్రికి అవ‌కాశం ఇచ్చే ఛాన్సే లేదు అన్న చ‌ర్చా సాగింది.

అయితే కాశ్మీర్ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్రితో చ‌ర‌ణ్ సినిమా చేస్తే లాభ‌న‌ష్టాలు ఎలా ఉంటాయి? అన్న‌ది కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఉత్త‌రాదిన కాశ్మీర్ ఫైల్స్ ఘ‌న‌విజ‌యం సాధించింది. దీనిని క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అంద‌రూ చూశారు. మెజారిటీ ప్ర‌జ‌ల మెప్పు పొంద‌డం వ‌ల్ల‌నే 300కోట్లు పైగా వ‌సూలు చేయ‌గ‌లిగింది. ఈ త‌ర‌హా డాక్యు క్లాసిక్ లో రామ్ చ‌ర‌ణ్ లాంటి మాస్ స్టార్ న‌టిస్తే అది వీక్ష‌కుల‌కు చాలా కొత్త‌గా ఉంటుంది. ఇది ఉత్త‌రాదిన చ‌ర‌ణ్ రీచ్ ని పెంచుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లో ఒక సెక్ష‌న్ మాస్ అభిమానుల‌కు అవ‌స‌ర‌మైన క‌మ‌ర్షియ‌ల్ ఇంగ్రీడియంట్ ని వివేక్ అందించ‌క‌పోవ‌చ్చు. దానివ‌ల్ల మ‌సాలా లేనిదే కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. లేదా మ‌సాలా లేని సినిమాలో చ‌ర‌ణ్ ని కొత్త‌గా చూసి సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అందువ‌ల్ల చ‌ర‌ణ్ ఇలాంటి ద‌ర్శ‌కుల‌తో కూడా ప‌ని చేయాలి. అయినా న‌టుడు అంటే ఒకే పంథా సినిమాల‌లో న‌టించ‌కూడ‌దు. ఒకే త‌ర‌హా పాత్ర‌ల‌ను ఎంపిక చేయ‌కూడ‌దు. అన్ని జాన‌ర్ల‌ను ట‌చ్ చేస్తూ త‌మ‌లోని విల‌క్ష‌ణ న‌టుడిని బ‌య‌టికి తేవాలి. ఆ విష‌యంలో చ‌ర‌ణ్ కి మెగాస్టార్ చిరంజీవి ఒక స్ఫూర్తి. గ్యాంగ్ లీడ‌ర్- ముఠా మేస్త్రి- రౌడీ అల్లుడు లాంటి సినిమాలు చేసిన చిరంజీవి స్వ‌యంకృషి-ఆప‌ద్భాంద‌వుడు లాంటి క్లాసిక్స్ లోను న‌టించారు. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా న‌టుడిగా మెప్పించారు. చ‌ర‌ణ్ కూడా చాలా ప్ర‌యోగాలు చేయాల్సి ఉంటుంది. నిజానికి ధృవ లాంటి ప్ర‌యోగం చేసిన రామ్ చ‌ర‌ణ్ క్రిస్టోఫ‌ర్ నోలాన్ 'ఇన్ సెప్ష‌న్' లాంటి సినిమాలోను న‌టించాల‌ని మెగాభిమానులు కోరుకుంటున్నారు. అలాంట‌ప్పుడు అగ్నిహోత్రితో డాక్యు సినిమా చేస్తే త‌ప్పే కాదు!

దీనివ‌ల్ల‌ భవిష్యత్తులో అతని ఇమేజ్ కు దెబ్బ‌ప‌డే ఛాన్సే లేదు. పైగా ప్ర‌యోగాల‌కు వెర‌వ‌ని సాహ‌సాల హీరోగా అత‌డిని అభిమానించే ఒక ప్ర‌త్యేక అభిమాన‌ వ‌ర్గం పెరుగుతుంది. అవ‌తార్ 3 లేదా అవ‌తార్ 4 లో రామ్ చ‌ర‌ణ్ కి జేమ్స్ కామెరూన్ అవ‌కాశం క‌ల్పిస్తే న‌టించ‌డా? న‌టించ‌కూడ‌ద‌ని సూచిస్తారా? అవ‌తార్ 2 ని మెరైన్ బ‌యోలాజిక‌ల్ డాక్యు సినిమా అని విమ‌ర్శించారు. అవ‌తార్ లా 3.5 బిలియ‌న్లు (అప్ప‌టి కరెన్సీలో సుమారు 18000 కోట్లు) వ‌సూలు చేయ‌లేక‌పోయింద‌ని విమ‌ర్శించినా కానీ అవ‌తార్ 2 చిత్రం ఇప్ప‌టికే 1 బిలియ‌న్ క్ల‌బ్ (7500 కోట్లు) లో చేరిన సినిమా అని గుర్తుంచుకోవాలి. చ‌ర‌ణ్ ఇక‌పై వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క సినిమాలు చేసి వ‌ర‌ల్డ్ స్టాండార్డ్స్ ని అందుకోవాలి. పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ కి ఎద‌గాల‌ని మెగాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్ర‌పంచీక‌ర‌ణ‌లో ఎవ‌రు ఎక్క‌డికి వెళ్లి అయినా మార్కెట్ ని పెంచుకోవ‌చ్చు. ఈ సువిశాల‌ ప్ర‌పంచంలో ఏపీ-టీఎస్ చాలా చిన్న‌వి. ఇక‌పై అన్ని మార్కెట్ల‌కు హాలీవుడ్ లా టాలీవుడ్ కూడా ద్వారాలు తెర‌వాలి. చైనా- అమెరికా-బ్రిట‌న్- జ‌పాన్- కొరియా - ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ స‌హా ఇండియ‌న్ డ‌యా స్పోరా ప్ర‌జ‌లు ఉన్న ప్ర‌తి చోటా రామ్ చ‌ర‌ణ్ సినిమా ఆడాల‌ని 'తుపాకి' కోరుకుంటోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.