Begin typing your search above and press return to search.
ఆస్కార్ ల నుండి తప్పుకో అంటూ బెదిరించారు!
By: Tupaki Desk | 24 Dec 2022 4:40 PM GMT2023 మార్చిలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాలను అందించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్లకు చేరిన సినిమాల జాబితా వెల్లడైంది. భారత్ తరపున ఈసారి `ఛలో షో` ఎంపికైంది. వాస్తవానికి 7 మార్చి 2023తో చివరి ఓటింగ్ ముగిసిన తర్వాత OSCAR 2023 కి అసలు జోష్ మొదలవుతుంది. 95వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు)ను 12 మార్చి 2023 (ఆదివారం)న అందించనున్నారు.
సెప్టెంబరులో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2023 ఆస్కార్ నామినేషన్లకు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా అంతగా బయటి ప్రపంచానికి తెలియని గుజరాతీ చిత్రం `ఛలో షో`ను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. `ఛలో షో` ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ లో చేరడంతో దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగింది. అయితే ఈ చిత్రాన్ని అకాడమీ అవార్డులకు పంపిన తర్వాత తన బృందం క్రూరమైన సైబర్ బెదిరింపులను ఎదుర్కొందని దర్శకుడు పాన్ నళిన్ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందిన RRRని వెనక్కి నెట్టి `ఛలో షో`కి ప్రాధాన్యత ఇవ్వడంతో అనేక మంది నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. RRR రెండు దశాబ్దాల తర్వాత భారతదేశానికి మొదటి అవకాశం అని.. RRR సరైన ఎంపిక అవుతుందని చాలామంది సెలబ్రిటీలు నెటిజనులు సోషల్ మీడియాల్లో పేర్కొన్నారు.
పాశ్చాత్య విమర్శకులు ప్రేక్షకులు RRRపై ప్రశంసలు కురిపించినందున దానిని కాదని.. అంతగా బయటి ప్రపంచానికి తెలియని `ఛలో షో`ని ఎంపిక చేయడం చాలా మందికి అనుమానాలను కలిగించింది. మీడియాలో దీనిపై రకరకాల కథనాలు వెలువడ్డాయి.
అంతేకాదు.. సినిమా విడుదలకు ముందే అత్యంత దారుణమైన సైబర్ బెదిరింపు ఎదురైందని ఇప్పుడు ఛలో షో దర్శకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు నళిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. విడుదలకు ముందు అత్యంత ఘోరమైన సైబర్ దాడిని ఎదుర్కొన్నాం. ``ఆస్కార్ మే సే ఫిల్మ్ నికాల్,.. నహీ తో అచ్ఛా నహీన్ హోగా (ఆస్కార్ ల నుండి వైదొలగండి లేదా అది మీకు మంచిది కాదు)`` అని నా టీమ్ ను బెదిరించారని ఆయన తెలిపారు. అమెరికాలో మా విజయానికి వేడుకగా సినిమాని ప్రచారం చేయడానికి బదులుగా మేం మూడు నుండి నాలుగు వారాల పాటు ఈ వ్యతిరేక స్వరాలతో పోరాడడంలో బిజీగా ఉన్నాం.. చివరికి సినిమా పవర్ గెలిచింది!! అని నళిన్ అభిప్రాయపడ్డారు.
RRR అసాధారణ యాక్షన్ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా వీక్షకులలో ఒక వర్గం RRR ని అదేపనిగా సపోర్ట్ చేసింది. ఛలో షో RRR ని పోటీలో వెనక్కి నెట్టి నామినేషన్ లో విజయం సాధించినప్పుడు వారంతా నిరాశ చెందారు. దీనిని ఉద్దేశించి నళిన్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. ``భారతీయ ప్రేక్షకులు విమర్శకులు పరిశ్రమ వ్యక్తులు ఆర్.ఆర్.ఆర్ ని చూసినప్పుడు విజువల్ ఫీస్ట్ పై ప్రేమలో పడకుండా ఆపుకోలేకపోయారు`` అని వ్యాఖ్యానించిన అతడు.. ``కానీ చివరికి సినిమా శక్తి (ఛలో షో కంటెంట్) గెలిచింది`` అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
ఇటాలియన్ చిత్రం `సినిమా ప్యారడిసో` నుంచి `ఛలో షో`ని కాపీ కొట్టానని నాపై ఆరోపించారు. నా సినిమాపై కాపీ క్యాట్ అంటూ చాలా మంది విరుచుకుపడ్డారు. పలువురు ట్విటర్ వినియోగదారులు `సినిమా ప్యారడిసో`(1998)లా ఉందని అన్నారు. ఆ సినిమాకి ఇది కేవలం ఇండియన్ వెర్షన్ అని విమర్శించారని అతడు తెలిపారు. ఛలో షో దర్శకుడు ఇంకా తన ఆవేదనను ఇలా వ్యక్తం చేసారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కూడా `ఛలో షో` భారతీయ చిత్రం కాదు కాబట్టి నామినేషన్ల నుంచి `రద్దు` చేయాలని డిమాండ్ చేసింది.
`ఛలో షో` భారతదేశంపై చెడు అభిప్రాయం కలిగిస్తుందని కూడా అన్నారు. ఇలా ఎందరో మమ్మల్ని బెదిరించారంటూ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే వీటిని బెదిరింపులుగా స్వీకరించాడా? సవాళ్లుగా స్వీకరించాడా? అన్నది వేచి చూడాలి. భారతదేశానికి ఆస్కార్ ని తేవడం ద్వారా ఈ బెదిరింపుల ముఠాలన్నిటికీ అతడి సినిమా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.