Begin typing your search above and press return to search.

కళావతి అప్పులు మరియు మహేశ్-కీర్తి లెగ్ ఎపిసోడ్ పై పరశురామ్ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   19 May 2022 4:31 AM GMT
కళావతి అప్పులు మరియు మహేశ్-కీర్తి లెగ్ ఎపిసోడ్ పై పరశురామ్ క్లారిటీ..!
X
'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఆయన లైఫ్ టైం అని పేర్కొంటున్ననీ సినిమాలో మహేశ్ ను ఎనర్జిటిక్ రోల్ లో ప్రెజెంట్ చేసి మెప్పించారు. అయితే స్టార్ హీరో ఇందులో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడం చూసి మహేష్ బాబు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.

మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ మధ్య లెగ్ ఎపిసోడ్ వల్గర్ గా ఉందని ఓ వర్గం ప్రేక్షకులు భావించారు. సినిమా సెకండాఫ్‌ లో కీర్తి సురేష్ పై కాలు వేసి పడుకోడానికి ప్రతి రోజు రాత్రి మహేష్ ఆమె ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే ఈ ఎపిసోడ్స్ ని కొందరు ఆస్వాదించగా.. మరికొందరు మాత్రం ఆ సీన్స్ లో అసభ్యత ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు పరశురాం 'సర్కారు వారి పాట' సినిమాలో వల్గారిటీ ఏం లేదని స్పష్టత ఇచ్చారు. ''ఆ సీన్స్ లో ఎక్కడా వల్గారిటీ లేదు. వల్గారిటీ వుంటే మహేష్ గారే వద్దని చెప్పేవారు. తల్లి దగ్గర నిద్రపోయే ఒక బిడ్డలా ఆ సీన్స్ ఉంటాయి తప్పితే.. అందులో వల్గారిటీ లేదు'' అని వివరణ ఇచ్చారు.

కేవలం క్యారెక్టరైజేషన్‌ నచ్చడంతోనే కాకుండా కథ కూడా నచ్చి మహేష్‌ బాబు ఈ సినిమా చేశాడని దర్శకుడు చెప్పారు. “కథ నచ్చకపోతే మహేష్ బాబు ఎందుకు సినిమా చేస్తాడు. ఇది తెలుగులో కొత్త కాన్సెప్ట్ మరియు అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్‌ తో నేను హ్యాపీగా ఉన్నాను'' అని పేర్కొన్నారు.

SVP లో మహేష్ బాబు నుంచి కీర్తి సురేష్ తీసుకున్న అప్పులపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె మొదట $10K తీసుకోగా.. తర్వాత $25K అప్పుగా తీసుకుంటుంది. అంటే ఆమె మొత్తం బాకీ $35K అవుతుంది. కానీ సినిమాలో మహేష్ మాత్రం ఆమెకు మొదటి ఇచ్చిన $10K మాత్రమే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు.

పరశురామ్ దీని గురించి మాట్లాడుతూ ''నిజానికి, హీరో హీరోయిన్‌ కి కేవలం 10వేల డాలర్లు మాత్రమే ఇస్తాడు. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు అతను మరో $25K ఇస్తాడు కాబట్టి కీర్తికి మహేశ్‌ ఇచ్చిన అప్పుల విషయంలో ఎలాంటి గందరగోళం లేదు'' అని స్పష్టం చేశారు.

విదేశాలలో వడ్డీలు వసూలు చేసే హీరో.. వైజాగ్ ప్రజలు బ్యాంకులకు EMIలు చెల్లించవద్దని చెప్పడం పై కూడా దర్శకుడు వివరణ ఇచ్చారు. ''కథను స్పష్టంగా గమనిస్తే, అప్పులు తీర్చమనే హీరో ఎప్పుడూ చెబుతుంటాడు. ప్రతి ఒక్కరూ అప్పులు తీర్చాలనేదే ఆయన ప్రధాన ఉద్దేశం'' అని పరశురాం పేర్కొన్నారు.

మహేష్‌ బాబును డైరెక్ట్ చేయడంతో తనకు మొదటి కిక్ లభించిందని.. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయినప్పుడు రెండవ కిక్ ఇచ్చిందని.. మహేష్ ను కొత్త లుక్‌ లో సరికొత్త క్యారెక్టర్‌ లో చూపించినందుకు అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేయడంతో మూడవ కిక్ ఇచ్చిందని పరశురాం చెప్పుకొచ్చారు.

తన తదుపరి చిత్రం 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ లో అక్కినేని నాగ చైతన్యతో ఉంటుందని దర్శకుడు పరశురామ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.