Begin typing your search above and press return to search.
పరశురామ్ కి సూపర్ లక్
By: Tupaki Desk | 25 July 2018 2:14 PM GMTకొన్నిసార్లు వేచి చూడటం మంచి ఫలితం ఇస్తుంది. కాకపోతే దానికి చాలా ఓపిక సహనం ఉండాలి. సినిమా పరిశ్రమలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటేనే మనుగడ సాధ్యం. ఇది గుర్తించాడు కాబోలు దర్శకుడు పరశురామ్ సరైన టైంలో తగిన ఫలితాలు అందుకుంటున్నాడు. ఆగస్ట్ 15న విడుదల కానున్న గీత గోవిందం వైపే ట్రేడ్ తో సహా ప్రేక్షకుల చూపు ఉంది. దానికి కారణం విజయ్ దేవరకొండ ఒక్కడే కాదు. గోపి సుందర్ ఇచ్చిన ట్యూన్-వెరైటీగా కట్ చేసిన టీజర్ వెరసి సినిమా మీద యూత్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు కలిగేలా చేసింది. నిజానికి దీని వెనుక ఆసక్తికరమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది.
అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు చేస్తున్న టైంలో పరశురామ్ పనితనాన్ని పసిగట్టిన అల్లు అరవింద్ నెక్స్ట్ మూవీకి కూడా ఆ షూటింగ్ టైంలోనే లాక్ చేసుకున్నాడు. కానీ హీరో కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు విజయ్ దేవరకొండ గీత బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు అప్పటికే సైన్ చేసాడు. వేర్వేరుగా ఎందుకులే అని చెప్పి ఈ ఇద్దరి కాంబోని సెట్ చేసేసారు అరవింద్. అది గీత గోవిందం రూపంలో వస్తోంది.
పరశురామ్ సెంటిమెంట్ ఎమోషన్ ని ఎంటర్ టైన్ మెంట్ తో బాలన్స్ చేయటంలో మంచి నేర్పరి. అది నారా రోహిత్ కు దక్కిన మొదటి హిట్ సోలోలోనే బయట పడింది. అంతకు ముందు యువత సినిమా నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. రవితేజతో చేసిన ఆంజనేయులు-సారొచ్చారు మాత్రమే లెక్క తప్పాయి. అల్లు శిరీష్ తో చేసిన శ్రీరస్తు శుభమస్తు అతని కెరీర్ లో ఫస్ట్ హిట్ గా నిలిచింది.
కథ ఏదైనా ఫామిలీతో పాటు యూత్ ని ఆకట్టుకునేలా రొమాంటిక్ స్టోరీస్ కి మాస్ టచ్ బాగా ఇస్తాడు పరశురామ్. ఇతనిలో ఉన్న ఆటిట్యూడ్ ఇదే. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి ఆటిట్యూడ్ ఉన్న హీరోని వర్జిన్ అంటూ బుద్ధిమంతుడు అంటూ ప్రొజెక్ట్ చేయటం ఇప్పటికే యువతకు బాగా ఎక్కేస్తోంది. ఈ నేపథ్యంలో గీత గోవిందం మీద అంచనాలు మామూలుగా లేవు. ఇది కనక గట్టిగా కొట్టాడు అంటే పరశురామ్ టాప్ లీగ్ లోకి వెళ్లడమే కాదు స్టార్ హీరోల కాల్స్ అందుకోవడం కూడా ఖాయమే అనిపిస్తోంది. ఇది తేలేది ఇండిపెండెన్స్ డే రోజునే.