Begin typing your search above and press return to search.
'సాహో' క్యాంప్ లో ఛాన్స్ దక్కేనా?
By: Tupaki Desk | 22 Oct 2019 5:21 AM GMTబాహుబలి 1 - 2.. సాహో.. అంటూ పాన్ ఇండియా సినిమాల్లో నటించాడు ప్రభాస్. ఆ క్రమంలోనే డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. వీటిలో `సాహో` రకరకాల పాఠాల్ని నేర్పింది. ఈ చిత్రం నార్త్ లో ఒకలా.. సౌత్ లో ఇంకోలా ఆడింది. అందుకే ఇప్పుడు ఎంచుకునే స్క్రిప్టుల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడట. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో 20వ సినిమా `జాన్` (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణ పూర్తి కాగానే .. కెరీర్ 21 వ సినిమాని ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఆ చిత్రానికి దర్శకుడు ఎవరు? అన్నది ఇప్పటివరకూ ఫైనల్ కాలేదు.
ఆ క్రమంలోనే పలువురు సీనియర్ దర్శకులతో పాటు కుర్ర డైరెక్టర్లు ప్రభాస్ కోసం గాలం వేస్తున్నారు. అయితే వీళ్లందరిలోనూ గీత గోవిందం ఫేం పరశురామ్ పేరు తాజాగా బయటకు వచ్చింది. అయితే పరశురామ్ స్క్రిప్టుతోనే డార్లింగ్ ని స్పెల్ బౌండ్ చేసేస్తాడా లేదా? అన్నది తేలాల్సి ఉంది. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అతడు ఒక స్టార్ ని ఒప్పించేందుకు ఎందుకనో స్ట్రగుల్ అవుతున్నాడు. తొలిగా బన్ని కి అతడు ఓ కథ చెప్పాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. తర్వాత మహేష్ ని కలిశాడు. కానీ అదీ కుదరలేదు. ఆ తర్వాత సీనియర్లను కాదనుకుని యువహీరోలతోనూ చేయాలనుకున్నాడు. అఖిల్ కోసం ట్రై చేశాడు. కానీ అదీ ఫైనల్ అని తేలలేదు. ఆ క్రమంలోనే అతడికి యూవి క్రియేషన్స్ పిలుపు అందిందట.
ప్రభాస్ మంచి స్క్రిప్టుల కోసం వెతుకుతున్నారు. అతడికి టాప్ డైరెక్టర్లందరితో మంచి సత్సంబంధాలు ఉన్నా కానీ యువదర్శకులకు ప్రయారిటీనిస్తున్నారు! అన్న టాక్ పరశురామ్ కి ఉత్సాహాన్నిచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్ కి స్క్రిప్టు వినిపించడం అంటే పాన్ ఇండియా కేటగిరీలోనే వినిపించాలి. యూనివర్శల్ ఆడియెన్ ని మెప్పించేదిగా ఉండాలి. అంటే ఆ మేరకు పరశురామ్ పూర్తిగా ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. కేవలం తెలుగు ఆడియెన్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినా .. ప్రభాస్ కి డబ్బింగ్ రైట్స్ పరమైన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనూ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి కంటే ముందు ప్రభాస్ ని స్క్రిప్టుతో ఒప్పించడం అంటే మాటలు కాదు.