Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ డైరెక్టర్‌... ఎన్టీఆర్ పై 20 ఏళ్ల అభిమానం

By:  Tupaki Desk   |   11 April 2022 2:30 AM GMT
కేజీఎఫ్ డైరెక్టర్‌... ఎన్టీఆర్ పై 20 ఏళ్ల అభిమానం
X
దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ముఖ్యంగా యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారు.. మాస్ సినిమాలను ఆరాధించే వారు అభిమానించే వారు కేజీఎఫ్ 2 సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ పేరు ప్రస్థావనకు వచ్చింది.

కేజీఎఫ్ 2 చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్‌ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని ఆయన కూడా క్లారిటీ గా చెప్పేశాడు. ఎన్టీఆర్ తో గత రెండేళ్లుగా సినిమా గురించి చర్చిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

ఇప్పటి వరకు తామిద్దరం 10 నుండి 15 సార్లు కలిశాం. కథ గురించి చర్చించక ముందు నుండే మామూలుగా ఎన్టీఆర్‌ ను కలిశాను. నా హీరోలను మొదట కలిసి వారి యొక్క పద్దతులను వారి యొక్క బాడీ లాంగ్వేజ్ లను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. అందుకే ఎన్టీఆర్‌ తో పలు సార్లు కలిసి ఆయన యొక్క స్టైల్‌ ను అర్థం చేసుకున్నట్లుగా ప్రశాంత్ నీల్‌ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే కథ ను సిద్దం చేసినట్లుగా చెప్పుకొచ్చిన ప్రశాంత్ నీల్ సినిమా నేపథ్యం ఏంటీ అనే విషయాన్ని చెప్పేందుకు నిరాకరించాడు. ఈ రెండు సంవత్సరాల జర్నీలో ఎన్టీఆర్ తనకు మంచి స్నేహితుడుగా మారాడు అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పుకొచ్చాడు. సినిమా స్క్రిప్ట్‌ కు సంబంధించిన విషయాలపై తుది చర్చ జరగాల్సి ఉందని ప్రశాంత్ నీల్‌ తెలియజేశాడు.

నేను ఎన్టీఆర్‌ కు 20 ఏళ్లుగా పెద్ద అభిమానిని అన్నాడు. అందుకే ఎన్టీఆర్‌ తో వర్క్‌ చేయడం కోసం చాలా ఎగ్జైట్‌ తో ఎదురు చూస్తున్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌ పేర్కొన్నాడు. సలార్ సినిమా ను పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ నీల్‌ ఆ సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ తో ప్రశాంత్ నీల్‌ చేయబోతున్న సినిమా వచ్చే ఏడాదిలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్‌ లో ఎన్టీఆర్‌ తన తదుపరి సినిమా ను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.