Begin typing your search above and press return to search.

జ‌పాన్ వాళ్ల‌ ఆ మూడు సూత్రాలు మ‌న‌మూ పాటిస్తే.. : పూరి

By:  Tupaki Desk   |   19 Dec 2022 1:30 PM GMT
జ‌పాన్ వాళ్ల‌ ఆ మూడు సూత్రాలు మ‌న‌మూ పాటిస్తే.. : పూరి
X
టాలీవుడ్ లో వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న పూరి జ‌గ‌న్నాథ్ రీసెంట్ గా పూరీ మ్యూజింగ్స్ పేరుతో త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్ గా `త‌డ్కా` గురించి ఆస‌క్తిక‌రమైన విష‌యాల‌ని వెల్ల‌డించిన పూరి జ‌గ‌న్నాథ్ తాజాగా `జ‌పాన్‌` ప్ర‌త్యేక‌త‌, అది ఎందుకు మ‌న‌కంటే ఉన్న‌త‌మైన స్థానంలో వుందో చెప్పుకొచ్చాడు. జ‌పాన్ లా మ‌న దేశం కూడా బాగుండాలంటే త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచే క్ర‌మశిక్ష‌ణ నేర్పించాల‌న్నారు.

అణుబాంబుల‌తో అట్టుడికిపోయి బూడిదైపోయింది అనుకున్న జ‌పాన్ ఆ విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డి ప్ర‌పంచ దేశాల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తోంద‌ని తెలిపారు. 6800 చిన్న దీవుల స‌మూహమే జ‌పాన్. ఇక్క‌డ 70 శాతం అట‌వీ ప్రాంతం వుండ‌గా, 30 శాతం మాత్ర‌మే భూమిలో మ‌నుషులు వుంటున్నార‌న్నారు. రూ.12 కోట్ల జ‌నాభాతో ప్ర‌పంచంలోనే ఈ దేశం మూడ‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా, టెక్నాల‌జీలోనూ ప్ర‌ధ‌మ స్థానంలో నిలుస్తోంది.

ప్ర‌పంచంలోనే ఉత్త‌మ భోజ‌నం, ఉత్త‌మ రావాణా ఈ దేశం సొంతం. జ‌పాన్ లో ఎక్క‌డా దుమ్ము క‌నిపించ‌దు. డ్రైనేటీ వ్య‌వ‌స్థ కూడా చాలా స్వ‌చ్ఛంగా వుంటుంది. అక్క‌డి ప్ర‌జ‌లు చాలా ఫ్రెండ్లీగా వుంటారు. ప్ర‌కృతి అంటే వారికి అమిత గౌర‌వం. ఆ దేశం అంత‌గా అభివృద్ధి చెంద‌డానికి కార‌ణం ప్ర‌జ‌ల క్ర‌మశిక్ష‌ణ‌. చిన్న‌త‌నం నుంచే వాళ్లు మూడు సూత్రాల‌ను బ‌లంగా పాటిస్తూ వుంటారు. ఒక‌టి ఆర్డ‌ర్‌, రెండు ప‌రిశుభ్ర‌త‌.. మూడు స‌మ‌య‌పాల‌న‌.

జ‌పాన్ దేశ‌స్తులు చిన్న‌త‌నం నుంచే వారి పిల్ల‌ల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పిస్తుంటారు. ఈ ఒక్క ఆలోచ‌న వ‌ల్లే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించింది. అక్క‌డి వారి పిల్ల‌లు శుభ్రంగా వుంటారు. ప‌రిశుభ్ర‌త‌ను పాటిస్తుంటారు. అంతే కాకుండా ఇంటిని ప‌రిశుభ్రంగా పెట్టుకుంటారు. జ‌పాన్ ప్ర‌జ‌ల‌కున్న మ‌రో మంచి అల‌వాటు స‌మ‌య‌పాల‌న‌. అనుకున్న‌దాన్ని అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయ‌లేక‌పోతే దాన్ని వారు అవ‌మానంగా భావిస్తుంటారు.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటారని తెలిపారు.

ఇదిలా వుంటే జ‌పాన్ లో ఎన్నో అగ్ని ప‌ర్వ‌తాలున్నాయ‌ని, అందులో ఏది ఎప్పుడు పేలుతుందో ఎవ‌రికీ తెలియ‌ద‌ని, ప్ర‌తీ ఇయ‌ర్ ప‌దిహేను వంద‌ల భూకంపాలు వ‌స్తుంటాయ‌ని, వాటిని త‌ట్టుకుని వారు జీవిస్తుంటార‌ని వెల్ల‌డించారు పూరి. ఈ విష‌యంలో హ్యాట్సాఫ్ టు జ‌పాన్ అన్నారు. ఆ దేశంలా మ‌న దేశం కూడా బాగుప‌డాలంటే పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచే క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పించాలి.. అప్పుడే దేశం మారుతుంద‌న్నారు పూరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.