Begin typing your search above and press return to search.

`రాధేశ్యామ్` అస‌లు సీక్రెట్ చెప్పేశాడు

By:  Tupaki Desk   |   14 Dec 2021 12:30 PM GMT
`రాధేశ్యామ్` అస‌లు సీక్రెట్ చెప్పేశాడు
X
వ‌చ్చే ఏడాది ప్రారంభంలో అంటే సంక్రాంతికి వ‌ర‌ల్డ్ వైడ్ గా సంద‌డి చేయ‌బోతున్న మూవీ `రాధేశ్యామ్‌`. ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా సినీ ప్రియుల్లో అంచ‌నాలు అంబ‌రాన్నంటాయి.

అయితే గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్ర క‌థ‌పై చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ‌కుమార్ `రాధేశ్యామ్` స్టోరీ లైన్ ని బ‌య‌ట పెట్టేసి అస‌లు సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టేశాడు.

ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ‌తో ముచ్చ‌టించిన ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ‌కుమార్ జాత‌కానికి, ప్రేమ‌క‌థ‌కు వున్నఆస‌క్తిక‌ర‌మైన అనుబంధాన్ని ల‌వ్ స్టోరీకి జోడించి స‌రికొత్త ట్రీట్ మెంట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన తీరుని బ‌య‌ట‌పెట్టేశాడు.

`ఇంటెన్స్ ల‌వ్ స్టోరీ, ప్ర‌మోష‌న్స్ లో అంతా చూసిన‌ట్టుగా అబ్బాయి - అమ్మాయి మ‌ధ్య రొమాన్స్ మాత్ర‌మే ఈ మూవీ కాదు. ఈ క‌థ‌ని లైఫ్ అండ్ డెత్ మ‌ధ్య సాగే సెల‌బ్రేష‌న్ గా చూపించాను.

అంతే కాకుండా లైఫ్ కి డెత్ కీ మ‌ధ్య సెల‌బ్రేష‌న్ జ‌రిగితే ఎలా వుంటుందో `రాధేశ్యామ్` అలా వుంటుంది. భావోద్వేగాల ప‌రంగా ఇది చాలా పెద్ద సినిమా. జాత‌కాల్ని న‌మ్మేవాళ్లున్నారు.

అస్స‌లు న‌మ్మ‌ని వాళ్లున్నారు. అందులో నిజ‌మెంత‌? .. అబ‌ద్ధం ఎంత‌? అనేది ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. దీనికి ల‌వ్ స్టోరీని జోడిస్తే ఎలా వుంటుంద‌నే ఆలోచ‌నే `రాధేశ్యామ్‌`` అని స్ప‌ష్టంగా త‌న సినిమా స్టోరీ ఏంటో రివీల్ చేసేశాడు. ఇక ఈ చిత్రానికి మ‌రి యూర‌ప్ నేప‌థ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు?.. అస‌లు ఈ ఆలోచ‌న ఎవ‌రిది అనే ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కూడా బ‌య‌ట‌పెట్టేశారు.

సినిమాకు వింటేజ్ లుక్ తో పాటు యూర‌ప్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవాల‌న్న‌ది ప్ర‌భాస్ ఆలోచ‌నే అని, ఆ క్రెడిట్ ఆయ‌న‌కే చెందుతుంద‌ని క్లారిటీ ఇచ్చేశాడు. `ఈ స్టోరీ రాసుకున్న‌ప్పుడే ఇది పెద్ద సినిమా. ఇక ఇందులోకి ప్ర‌భాస్ రావ‌డంతో దీని రేంజ్ ఇంకా పెరిగింది.

ఇండియాలోనే వింటేజ్ లుక్ తో తీయాల‌నేది నా ఆలోచ‌న‌. అయితే ప్ర‌భాస్ మాత్రం యూర‌ప్ లోనే చేద్దామ‌న్నారు. వింటేజ్ యూర‌ప్ నేప‌థ్యంలో చేస్తే బాగుంటుంద‌ని, ఆ నేప‌థ్యాన్ని ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేద‌ని చెప్ప‌డంతో వెంట‌నే నాతో పాటు నిర్మాత‌లు కూడా ఒప్పుకున్నారు.

ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విషయం ఏంటంటే ఈ చిత్ర క‌థ కోసం ద‌ర్శ‌కుడు 15 ఏళ్లు శ్ర‌మించార‌ట‌. అయితే ఈ క‌థ కార్య‌రూపం దాల్చ‌డం వెన‌క ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం దాగి వుంద‌ని అది ప్ర‌స్తుతానికి సీక్రెట్ అని దాన్ని క‌రెక్ట్ టైమ్‌లో క‌రెక్ట్ వేదిక‌పై ఈ సీక్రెట్ ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.