Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్‌' డైరెక్ట‌ర్ అస‌లు సీక్రెట్ చెప్పేశాడు

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:30 AM GMT
రాధేశ్యామ్‌ డైరెక్ట‌ర్ అస‌లు సీక్రెట్ చెప్పేశాడు
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఆరు చిత్రాల‌ని లైన్ లో పెట్టేసిన ప్ర‌భాస్ అందులో రెండు భారీ చిత్రాల‌ని పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అందులో ఒక‌టి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో వుండ‌గా మ‌రొక‌టి రిలీజ్ కి రెడీ అయిపోయింది.

అదే విజువ‌ల్ వండ‌ర్ `రాధేశ్యామ్‌`. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల‌కు పైనే అభిమానులు ఎదురుచూస్తున్నారు. కోవిడ్ కార‌ణంగా చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చిన ఈ మూవీ రిలీజ్ కూడా అదే త‌ర‌హాలో పోస్ట్ పోన్ అవుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

1970వ ద‌శ‌కంలో యూర‌ప్ నేప‌థ్యంలో సాగే పిరియాడిక్ ల‌వ్ స్టోరీగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ రూపొందించారు. బాలీవుడ్ మేక‌ర్స్ టి సిరీస్ తో క‌లిసి యువీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించింది. రిలీజ్ మ‌రో రెండు వారాలు వుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని భారీగా ప్లాన్ చేసింది.

డైరెక్ట‌ర్ రాథాకృష్ణ‌కుమార్ ప‌లు మీడియాల‌తో పాటు యూట్యూబ్ ఛాన‌ల్స్ కి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ఈ సంద‌ర్భంగా `రాధేశ్యామ్‌` గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

అంతే కాకుండా స్టోరీకి సంబంధించిన అస‌లు సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌భాస్ కు క‌థ వినిపించ‌గానే అయిన చాలా ఎక్జైట్ అయ్యార‌ని, అంతే కాకుండా విక్ర‌మాదిత్య పాత్ర‌లో న‌టించ‌డానికి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని తెలిపిన రాధాకృష్ణ కుమార్ సినిమా బ్యాక్ డ్రాప్ ని ఇట‌లీకి మార్చ‌డం వెన‌కున్న ఐడియా ప్ర‌భాస్ దేన‌ని చెప్పుకొచ్చారు. ముందు ఈ క‌థ‌ని ఏదైనా హిల్ స్టేష‌న్ నేప‌థ్యంలో చేయాల‌ని ప్లాన్ చేశాన‌ని, అయితే ప్ర‌భాస్ దీనికి ఇట‌లీ నేప‌థ్యం అయితేనే బాగుంటుంద‌ని, అక్క‌డికి వెళ్లి షూట్ చేద్దామ‌ని చెప్పార‌న్నాడు.

ప్ర‌భాస్ ఇచ్చిన ఐడియా వ‌ల్లే `రాధేశ్యామ్‌` విజువ‌ల్ ఫీస్ట్ గా మారింద‌ని చెప్పుకొచ్చాడు. క‌రోనా కు ముందు ఇట‌లీతో పాటు యూర‌ప్ దేశాల్లో షూటింగ్ చేశామ‌ని, అయితే ఆ త‌రువాత అమ‌ల్లోకి వ‌చ్చిన ఆంక్ష‌ల కార‌ణంగా ఇట‌లీకి హైద‌రాబాద్ లోనే రీ క్రియేట్ చేసి భారీ సెట్ ల‌లో షూటింగ్ జ‌రిపామ‌న్నారు.

సినిమాలో రాజులు, యువ‌రాజులు.. ప్రెసిడెంట్ .. ప్రైమ్ మినిస్ట‌ర్ వంటి వారికి ప‌ల్మ‌నాల‌జీ గురించి చెప్పే హ‌స్త‌సాముద్రికా నిపుణుడిగా ప్ర‌భాస్ క‌నిపిస్తార‌ని, ప్ర‌పంచంలోనే ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న మొట్ట‌మొద‌టి సినిమా ఇదేన‌ని చెప్పారు రాథాకృష్ణ‌కుమార్‌.

జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ పాట‌ల‌కు సంగీతం అందిస్తే త‌మ‌ర్ నేప‌థ్య సంగీతం అందించాడ‌ని, త‌న బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లార‌ని చెప్పారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న ఉక్రెయిన్ లో అత్య‌ధిక భాగం వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ జ‌రిపామ‌ని చెప్పారు. ఇదిలా వుంటే ఈ చిత్రంలోని కీల‌క ఘ‌ట్టాలైన ట్రైన్ , ఓడ కు సంబంధించిన స‌న్నివేశాలు సినిమాకు అత్యంత కీల‌కంగా నిల‌వ‌నున్నాయ‌ని, ఇవే సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.