Begin typing your search above and press return to search.

మహేష్‌ కు దర్శకేంద్రుడి మొదటి పాఠం

By:  Tupaki Desk   |   6 May 2019 4:14 AM GMT
మహేష్‌ కు దర్శకేంద్రుడి మొదటి పాఠం
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన సినీ కెరీర్‌ లో హీరోగా 25 చిత్రాల మైలు రాయిని చేరుకున్నాడు. తాజాగా చేసిన 25వ చిత్రం మహర్షి విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నాడు. సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సమయంలో తనతో వర్క్‌ చేసిన అందరు దర్శకుల గురించి మాట్లాడిన మహేష్‌ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా దర్శకుడు అయిన రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.

హీరోగా నా మొదటి సినిమా కథను చెప్పేందుకు పరుచూరి బ్రదర్స్‌ వచ్చారు. వారు కథ చెబుతున్న సమయంలో నేను అక్కడ టేబుల్‌ పై ఉన్న ఒక రబ్బర్‌ బ్యాండ్‌ తో ఆడుతూ ఉన్నాను. వారు చెప్పే విషయంపై శ్రద్ద పెట్టలేదు. కథ చెప్పి పరుచూరి బ్రదర్స్ వెళ్లి పోయిన తర్వాత రాఘవేంద్ర రావు గారు నాకు క్లాస్‌ పీకారు. ఒక దర్శకుడు కథ చెబుతున్న సమయంలో చాలా సీరియస్‌ గా వినాలి - ఆసక్తి లేకున్నా కూడా ఆసక్తితో కథ వినాలి - ఒక వేళ చెబుతున్న సమయంలో శ్రద్ద పెట్టకుంటే దర్శకుడు కాన్ఫిడెన్స్‌ కోల్పోతాడు అంటూ రాఘవేంద్ర రావు గారు నాకు మొదటి పాఠం చెప్పాడని మహేష్‌ బాబు చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో తన ప్రతి సినిమా కథను తానే ఫైనల్‌ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. మహేష్‌ నటించిన - నటించబోతున్న కథలను మొదట నమ్రత వింటుందని - ఆమెతో పాటు మహేష్‌ బాబు సన్నిహితులు కొందరు విన్న తర్వాత కథ ఫైనల్‌ చేస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో ఉంది. ఆ ప్రచారం నిజం కాదని మహేష్‌ బాబు మాటలతో వెళ్లడయ్యింది. కథ ఎంపిక విషయంలో ఫైనల్‌ నిర్ణయం తనదే అన్నట్లుగా మహేష్‌ చెప్పుకొచ్చాడు.

ఇక గతంలో కొన్ని నిమిషాలు కథ విని సినిమాకు ఓకే చెప్పే వాడిని అని - కాని ఇప్పుడు కథ మొత్తం విని - స్క్రిప్ట్‌ కూడా పూర్తిగా చదివిన తర్వాతే ఓకే చెప్పాలనుకుంటున్నట్లుగా మహేష్‌ చెప్పుకొచ్చాడు. ఏ కథను అయినా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.