Begin typing your search above and press return to search.
దర్శకేంద్రుడు ఆ ప్రయోగం చేసింది ఆమె పైనే!!
By: Tupaki Desk | 4 Jan 2021 12:30 AM GMTదర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అనగానే గుర్తుకు వచ్చేవి ఆయన రొమాంటిక్ సాంగ్స్. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న రాఘవేంద్ర రావు రొమాంటిక్ పాటలకు పెట్టింది పేరుగా నిలిచాడు. హీరోయిన్ లను అందంగా చూపించడంలో రాఘవేంద్ర రావు తర్వాతే మరెవ్వరైనా అనే టాక్ ఇప్పటికి ఉంది. రాఘవేంద్ర రావు హీరోయిన్స్ ను చూపించినంత రొమాంటిక్ గా మరే దర్శకుడు ఇప్పటి వరకు కూడా చూపించలేదు అంటారు ఆయన అభిమానులు. రాఘవేంద్ర రావు మాత్రమే హీరోయిన్స్ నడుముపై ఎద భాగంలో పండ్లను పూలను వేయడం జరిగింది.
ఆయనలా మళ్లీ ఎవరు కూడా అలా ట్రై చేయలేదు. ఎవరైనా చేసినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిందే తప్ప వావ్ అనిపించుకోలేరు. అలా ట్రెండ్ సెట్ చేసిన రాఘవేంద్ర రావు మొదటి సారి పూలు పండ్లు ఏ హీరోయిన్ పై వేశాడు అనే ఆసక్తికర విషయం తాజాగా చర్చకు వచ్చింది. రాఘవేంద్ర రావు మొదటి సారి 1988లో చిరంజీవి హీరోగా రూపొందిన మంచి దొంగ సినిమాలో ఈ ప్రయోగంను చేశాడు. ఆ సినిమాలో విజయశాంతి మరియు సుహాసిన నటించారు. ఆ సినిమాలో విజయశాంతి పాత్ర రొమాంటిక్ గా ఉంటుంది. కనుక ఆమె పై పూలు పండ్లు వేసి మరింత రొమాంటిక్ గా పాటను మల్చాడు.
ఆ పాట చిత్రీకరణ సమయంలో ఆయన్ను యూనిట్ సభ్యులు కూడా కొందరు తప్పుబట్టారు అనే టాక్ వచ్చింది. అయినా కూడా తాను అనుకున్నట్లుగా హీరోయిన్ గా పూలు పండ్లు వేశాడు. విజయశాంతికి మరియు ఆ పాటకు విపరీతమైన పేరు వచ్చింది. ఇక అప్పటి నుండి రాఘవేంద్ర రావు పాటల ప్రాపర్టీగా పూలు పండ్లు చోటు దక్కించుకున్నాయి. రాఘవేంద్ర రావు మార్క్ పాటలను మిస్ అవుతున్నాం అంటూ ఆయన అభిమానులు ఇప్పటికి అంటూ ఉంటారు. రాఘవేంద్ర రావు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నిర్మాతగా.. నటుడిగా సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే దర్శకుడిగా కూడా సినిమా చేయాలని అభిమానులు ఆశ పడుతున్నారు.