Begin typing your search above and press return to search.
ఆ క్యారెక్టర్ లో రాజమౌళి
By: Tupaki Desk | 30 Jan 2018 9:48 AM GMTమన స్టార్ దర్శకులు సాధారణంగా వెండితెరపై కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఏదైనా సరదా సన్నివేశం అనిపిస్తే ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తారు. ఇక ఇతర దర్శకులు ఎవరైనా ఒక సన్నివేశం చేయాలనీ కోరితే వారి స్టైల్ లో నటించడానికి ఇష్టపడతారు. అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలను అందుకున్న దర్శకదీరుడు రాజమౌళి మొదటి సారి ఒక కీలక పాత్రలో వెండితెరపై అలరించనున్నాడట.
ఎంతో స్టార్ హీరోలను తన దర్శకత్వ శైలిలో చూపించిన రాజమౌళిని ఆయన శిష్యుడే డైరెక్ట్ చేయబోతున్నాడు. ద్రోణ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినా కరుణ్ కుమార్ ఆ సినిమాతో ఫెయిల్యూర్ ని అందుకున్నాడు. అయితే చాలా కాలం తరువాత కొత్త నటి నటులతో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సుకుమార్ శిష్యుడు హరి ప్రసాద్ కథ - మాటలను అందించనున్నాడు. హరి ప్రసాద్ రీసెంట్ గా దర్శకుడు అనే సినిమాను తెరకెక్కించాడు.
అరుణ్ కుమార్ - హరి ప్రసాద్ రీసెంట్ గా రాజమౌళిని కలిసి ఒక లెన్తీ సపోర్టింగ్ రోల్ చేయాలనీ చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నాడట. డాక్టర్ పాత్రలో జక్కన్న కనిపించనున్నాడట. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో రాజమౌళి అతిధి పాత్రలు చేశారు. ముఖ్యంగా తన సినిమాల ఎండింగ్ లో "షాట్ ఒకే" అని చెప్పేవాడు. సై సినిమాలో వేణుమాధవ్ తో కలిసి కామెడీ కూడా చేశాడు. రెయిన్ బో - మజ్ను సినిమాల్లో రాజమౌళిలా కనిపించాడు. బాహుబలిలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఫైనల్ గా జక్కన్న ఆ పాత్రల కంటే కొంచెం ఎక్కువ సమయం సినిమాలో కనిపిస్తాడట. మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.