Begin typing your search above and press return to search.
కాష్మోరా.. ‘బాహుబలి’కి దీటుగా..
By: Tupaki Desk | 24 Oct 2016 11:30 AM GMTసినిమాల్లో భారీతనం అంటే ఏంటో ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలకూ చూపించింది ‘బాహుబలి’ సినిమా. సెట్టింగ్స్ చూసుకున్నా.. గ్రాఫిక్స్ పరిశీలించినా.. ఇంకా ఏ రకంగా చూసినా భారీతనం విషయంలో ‘బాహుబలి’ అగ్ర భాగాన నిలుస్తుంది. దీని తర్వాత వచ్చినా.. రాబోయే భారీ సినిమాలన్నీ కూడా సెట్టింగ్స్.. గ్రాఫిక్స్ విషయంలో ఉన్నత ప్రమాణాలు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. ‘బాహుబలి’తో పోల్చదగ్గ.. దానికి దీటైన సినిమాగా కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్న ‘కాష్మోరా’ కూడా చాలా విషయాల్లో ఉన్నత ప్రమాణాలతోనే తెరకెక్కింది అంటున్నాడు దాని ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డామో అతను వివరించాడు.
‘‘కాష్మోరాలో 35 నిమిషాల పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అదే సినిమాకు ప్రధాన ఆకర్షణ. దాని కోసం ఎంత కష్టపడ్డామో మాటల్లో చెప్పలేం. నా కెరీర్లోనే అత్యంత భారీ సెట్టింగ్స్ వేశాను. కాష్మోరా కోసం మొత్తం 19 భారీ సెట్టింగులు వేశాం. అందులో అత్యంత ముఖ్యమైంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం 1200 అడుగుల ఎత్తుతో ఒక భారీ టవర్ నిర్మించాం. దాని పై భాగాన గద్ద తల ఉంటుంది. రాజ దర్బారు సెట్టింగ్ చూస్తే ప్రేక్షకులు విస్మయానికి గురవుతారు. అలాగే 200 అడుగుల ఎత్తుండే ఒక పిల్లర్ కూడా నిర్మించాం. మేం వేసిన 19 సెట్లలో దేనికదే భిన్నంగా ఉంటుంది. వార్ ఫీల్డ్ కోసం కొండ విరిగి చెల్లాచెదురైనట్లుగా వేసిన సెట్టింగ్ అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ‘కాష్మోరా’ ప్రేక్షకుల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది’’ అని రాజీవన్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/