Begin typing your search above and press return to search.
అన్యాయమంటూ దీక్షకు దిగిన దర్శకుడు
By: Tupaki Desk | 13 Jun 2017 4:05 PM GMTసినీ దర్శకుడు ఒకరు దీక్షకు దిగారు. చిన్న సినిమాల్ని బతికించాలంటూ ఫిలింనగర్ లోని ఫిలిం ఛాంబర్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు కలకలంగా మారింది. దర్శకుడు కమ్ రచయితగా పరిచితుడైన రాజేశ్ సాయి మాట్లాడుతూ.. చిన్న సినిమా చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతుందని.. దాన్ని బతికించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి సాయి దీక్ష మొదలెట్టి ఇవాల్టికి (మంగళవారం) రెండో రోజు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితుల్లో ఉన్నాయని.. వాటిని ఆదుకోవాల్సిన అవసరం ఉందంటూ దీక్షకు దిగారు.
వందల కోట్ల సినిమాలకు ఏ విధంగా అయితే ఖర్చు పెడతారో.. చిన్న సినిమాకు సైతం అలాంటి ఖర్చులే ఉంటాయని.. అయినప్పటికీ థియేటర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించిన సినిమాను రిలీజ్ చేయటానికి థియేటర్లు దొరకట్లేదన్నారు.
ఒకవేళ చిన్న సినిమాకు థియేటర్లు దొరికి బాగా ఆడుతున్నా.. పెద్ద సినిమాల కోసం తీసేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందన్న ఆయన.. రాష్ట్రంలో ప్రభుత్వం కింద 50 సినిమా థియేటర్లను ఉంచుకోవాలన్నారు. అలా ఉంచిన థియేటర్లను చిన్న సినిమాల కోసం ఉపయోగించాలని కోరారు. నిజమే.. వందల కోట్లు పెట్టి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టే ప్రభుత్వం.. చిన్న సినిమాల్ని ప్రోత్సహించేందుకు మినీ థియేటర్లను నిర్మిస్తే బాగుంటుంది కదా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/