Begin typing your search above and press return to search.

ఏకాంత ద్వీపంలో జిఎస్టి పార్ట్ 2

By:  Tupaki Desk   |   4 Feb 2018 8:45 AM GMT
ఏకాంత ద్వీపంలో జిఎస్టి పార్ట్ 2
X
సంచలనాల వేదిక రామ్ గోపాల్ వర్మ పోర్న్ వీడియో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విజయం సాధించిందా లేదా అని చెప్పడానికి అదేమీ సినిమా కాదు కాని రెస్పాన్స్ పరంగా చూసుకుంటే మాత్రం అతను సక్సెస్ అందుకున్నట్టే. తనకు కావలసిన రీతిలో పబ్లిసిటీ చేసుకోవడం ఎలాగో బాగా తెలిసిన వర్మ అందుకు తగ్గట్టే ప్లాన్ వేసి ఇరవై నిమిషాల వీడియోతో మియా మల్కొవాను సాధారణ ప్రేక్షకులకు కూడా పరిచయం చేసేసాడు. అధికారికంగా చెప్పలేదు కాని వీడియో హిట్స్, ఛార్జెస్, యాడ్స్ రూపంలో 9 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందనే టాక్ అయితే సోషల్ మీడియాలో బలంగా ఉంది. దీని గురించి వర్మ ఏమి మాట్లాడ్డం లేదు. ఇప్పుడు దీని సీక్వెల్ కు కూడా సిద్ధమైపోయాడు వర్మ. సెకండ్ పార్ట్ తీయబోతున్నాను అని ట్విట్టర్ లో ప్రకటించేసాడు.

ఫస్ట్ పార్ట్ మొత్తం ఒక ఇన్ డోర్ సెట్టింగ్ లో జరిగింది. ఈ సారి రెండో భాగం కోసం మియా మల్కొవాను ఒక ద్వీపానికి తీసుకువెళ్తున్నాడు వర్మ. లొకేషన్ అవుట్ డోర్ కాబట్టి తన క్రియేటివిటీని ఇంకా బాగా చూపించవచ్చు అనేది వర్మ ఎత్తుగడ. చెప్పాల్సింది మొత్తం ఈ పాటికే చెప్పేసిన వర్మ ఇప్పుడు ఏం చూపిస్తాడు అనే దాని కన్నా మల్కొవాతో ఏం చెప్పిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. వర్మ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో మ్యాటర్ ఉన్నా లేకపోయినా జనం ఆ వీడియో కోసం ఎదురు చూసేలా కొత్త స్ట్రాటజీ సెట్ చేసుకుంటాడు కాబట్టి ఇంకేం చూస్తారు అనే అనుమానం అక్కర్లేదు. ఆ ఐలాండ్ ఏది, ఎక్కడ ఉంది అనే వివరాలు మాత్రం వర్మ బయట పెట్టలేదు.

ఈ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సంగతి సరే కాని మా నాగార్జున సినిమా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు అక్కినేని ఫాన్స్. ఒకపక్క ఆ షూటింగ్ కూడా జరుగుతున్నా వర్మ జిఎస్టి తప్ప దేని గురించి మాట్లాడ్డం లేదు. సినిమా అయ్యాక ఇవన్ని చేసుకుని ఉండొచ్చుగా అనే కామెంట్ వస్తున్నా వింటే ఆయన వర్మ ఎందుకు అవుతాడు. జిఎస్టి సెకండ్ పార్ట్ మరో రెండు నెలల్లోనే వదిలే అవకాశాలు ఉన్నాయి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలిగా...