Begin typing your search above and press return to search.
హీరోయిన్ తో హగ్ కు భయపడ్డ డైరెక్టర్
By: Tupaki Desk | 16 Oct 2018 5:20 AM GMTఇండియాలో పాశ్చాత్య సంస్కృతి విపరీతంగా పెరిగి పోయింది. ఒకప్పుడు అభినందించుకోవడం అంటే భుజం తట్టడం, కాని ఇప్పుడు హగ్ చేసుకుని వెనుక చర్చడంగా మారిపోయింది. సెలబ్రెటీలు ముఖ్యంగా బాలీవుడ్ లో హగ్ లు సర్వ సాదారణం అనే విషయం తెల్సిందే. బాలీవుడ్ లో ఏంటీ అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా హగ్ లతో అభినందించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు అభినందిస్తూ హగ్ చేసుకున్నట్లుగా చేసుకుని లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారంటూ ఇటీవల మీటూ ఉద్యమంలో భాగంగా ఒక మహిళ సోషల్ మీడియాలో ఆరోపణలు చేసింది. ఆ కారణంగా దర్శకుడు ఒక హీరోయిన్ ఇవ్వబోయిన అప్రిషియేషన్ హగ్ ను కాదన్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... అమలా పాల్ తాజాగా ‘రాక్షసన్’ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్బంగా అమలా పాల్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత చాలా బాగా వచ్చిందని, సినిమాను బాగా తీశారంటూ దర్శకుడు రామ్ కుమార్ ను అభినందించేందుకు ఆయన్ను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఆయన కంగారు పడి తప్పించుకున్నాడని అమలా పాల్ నవ్వుతూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం మీటూ అంటూ లైంగిక వేదింపుల ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో రామ్ కుమార్ ఎందుకు వచ్చిన గొడవలే అనుకుని అమలా పాల్ కౌగిలింతను తిరష్కరించి ఉంటాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మీటూ ఉద్యమంపై అమలా పాల్ మాట్లాడుతూ.. తాను గత ఫిబ్రవరిలో మీటూ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైందని, మీటూ అనేది ఒక మంచి విషయమని, ఈ ఉద్యమం ఇంకా పెరగాలని కోరుకుంటున్నట్లుగా అమలా పాల్ పేర్కొంది. రెండవ పెళ్లి విషయంలో ఆమె మాట్లాడుతూ తన జీవితం మొత్తం సినిమాలే అని, మరో ఆలోచన లేదంటూ ప్రకటించింది.