Begin typing your search above and press return to search.

ఆమె మీటూ ఆరోపణలపై దర్శకుడు క్లారిటీ

By:  Tupaki Desk   |   17 Oct 2019 7:07 AM GMT
ఆమె మీటూ ఆరోపణలపై దర్శకుడు క్లారిటీ
X
టాలీవుడ్‌ విలక్షణ దర్శకుడు మరియు నటుడు అయిన రవిబాబు పై ఇటీవల ఒక నటి లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆయన తన పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాడని.. తనను మానసికంగా ఇబ్బంది పెట్టడంతో పాటు శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు అంటూ ఆమె ఆరోపించింది. ఆ సమయంలో ఆమె రవిబాబు తనతో ఫేస్‌ బుక్‌ లో చాట్‌ చేశాడని కూడా ఒక ఫేస్‌ బుక్‌ చాట్‌ ను చూపించింది. ఆ సమయంలో ఈ విషయమై సోషల్‌ మీడియాలో చాలా ప్రచారం జరిగింది.

ఇన్ని రోజులు మౌనంగా ఉన్న రవిబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అన్నాడు. నేను చేసిన 'నువ్విలా' చిత్రంలో ఒక చిన్న పాత్ర చేసింది. ఆ తర్వాత ఆమెతో ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదు. ఆమె చెబుతున్నట్లుగా నేను ఫేస్‌ బుక్‌ ద్వారా ఆమెతో చాటింగ్‌ చేసిందే లేదు. అసలు నాకు ఇన్‌ స్టాగ్రామ్‌ తప్ప ఏ ఇతర సోషల్‌ మీడియా అకౌంట్‌ లేదని రవిబాబు పేర్కొన్నాడు.

ఆమె కొన్ని వెబ్‌ సైట్స్‌ వద్దకు వెళ్లి చేసిన ఆరోపణలు నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా వాటిని ప్రసారం చేశారు. అలాంటి వారిని ప్రమోట్‌ చేయడం కోసం కొందరు పని చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాకు వారిపై ఎలాంటి యాక్షన్‌ తీసుకోవాలనని లేదు. అసలు ఆ విషయం గురించే నేను పట్టించుకోవడం లేదన్నాడు.

రవిబాబు ప్రస్తుతం మరో విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. 'ఆవిరి' అనే టైటిల్‌ తో రవిబాబు సినిమా చేస్తున్నాడు. నవంబర్‌ 1వ తారీకున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. రవిబాబు కమర్షియల్‌ సక్సెస్‌ దక్కించుకోక చాలా కాలం అయ్యింది. ఆవిరితో కమర్షియల్‌ గా సక్సెస్‌ అవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు.