Begin typing your search above and press return to search.

కోటితో సినిమా, పబ్లిసిటీకి అర కోటి..

By:  Tupaki Desk   |   19 Feb 2016 3:30 PM GMT
కోటితో సినిమా, పబ్లిసిటీకి అర కోటి..
X
ఇప్పుడు సినిమా తీయడమంటే బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని అనాల్సిందే. కానీ కొందరు మాత్రం అతి తక్కువ పెట్టుబడితో, మంచి సినిమాలు తీసేసి ఆశ్చర్యపరుస్తుంటారు. పీవీపీ బ్యానర్ అంటే పెద్ద స్టార్లతో భారీ సినిమాలు తీస్తుందనే పేరుంది. కానీ ఇప్పుడా సంస్థ నుంచి వస్తున్న క్షణం లోబడ్జెట్ మూవీ కావడమే ఆశ్చర్యమయితే.. ఈ చిత్రాన్ని కోటి రూపాయల్లోపు బడ్జెట్ మాత్రమే అవడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం.

కుర్ర డైరెక్టర్ రవికాంత్ పెరెపు చెప్పిన కాన్సెప్ట్ ని నమ్మిన పీవీపీ సినిమాస్.. పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. బడ్జెట్ విషయంలోనూ పర్లేదని చెప్పినా.. ముందుగా చెప్పిన కమిట్ మెంట్ లోనే పిక్చర్ కంప్లీట్ చేశాడు డైరెక్టర్. కోటి రూపాయల్లోపే సినిమా తీసేశాడు. ఇప్పుడా మూవీ ట్రైలర్ కానీ, విజువల్స్ కానీ చూస్తుంటే.. ఇది ఇంత లోబడ్జెట్ తో తీసిన సినిమా అంటే నమ్మడం కష్టమే. ఇప్పుడు క్షణం మీద అంచనాలు లెక్కకు మించి ఉన్నాయి. అందుకే పబ్లిసిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు నిర్మాత.

క్షణం చిత్రానికి ప్రచారం కోసమే 50 లక్షలు కేటాయించారు. ఇది భారీ బడ్జెట్ చిత్రాల పబ్లిసిటీ ఖర్చుతో సమానం. ఈ ప్రచారం కూడా క్షణంకి బాగానే హెల్ప్ అవుతోంది. ఈ నెల 26న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది క్షణం. అడివి శేష్, ఆదాశర్మ నటించిన ఈ మూవీలో.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో యాంకర్ అనసూయ కనిపించనుంది.