Begin typing your search above and press return to search.
దర్శకుడి రిక్వెస్ట్.. 24 గంటల్లో సోనూ భాయ్ సాయం
By: Tupaki Desk | 9 May 2021 8:30 AM GMTకరోనా విపత్తు సమయంలో ప్రభుత్వంను నమ్ముకుంటే ప్రాణాలు పోవడం తప్ప మరేమి లేదు. కొన్ని లక్షల మంది కరోనాతో బాధపడుతున్న ఈ సమయంలో ప్రభుత్వం నుండి సత్వర సాయంను ఆశించడం అత్యాశ అవుతుంది. ఈ సమయంలో సినీ నటుడు సోనూసూద్ ప్రభుత్వం కంటే వేగంగా పని చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు సాయం అడిగినా కూడా వెంటనే స్పందించి తనకు సాధ్యం అయినంత వరకు సాయం చేస్తూ వస్తున్నాడు. ప్రముఖులు కూడా సోనూ సూద్ నుండి సాయం పొందుతున్నారు.
ఇటీవల క్రికెటర్ రైనా తన ఆంటీకి ఆక్సీజన్ సిలిండర్ అవసరం అంటూ పోస్ట్ పెట్టిన వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలో ఆమెకు ఆక్సీజన్ సిలిండర్ ను అందించాడు. ఇక ఇటీవల మెహర్ రమేష్ ట్విట్టర్ లో వెంకట రమణ అనే పేషంట్ కు మందులు మరియు అత్యవసర కిట్ అవసరం అంటూ పేర్కొన్నాడు. సోనూ సూద్ వెంటనే స్పందించి మెహర్ రమేష్ అడిగిన మందులు మరియు ఇతర అవసరాలకు సంబంధించిన పరికరాలను సోనూసూద్ కేవలం 24 గంటల లోపులో సమకూర్చాడు. సోనూ సూద్ మంచితనంకు ఇది మరో నిదర్శణం.
సోనూసూద్ నుండి దక్కిన సాయంను మెహర్ రమేష్ ట్వీట్ చేశాడు. వెంకట రమణ కు సోనూసూద్ చేసిన సాయంను మెహర్ రమేష్ చూపించాడు. సోషల్ మీడియాలో వీరిద్దరి సంభాషణ వైరల్ అవుతోంది. మెహర్ రమేష్ ఈమద్య కాలంలో సినిమాల మేకింగ్ కు దూరం అయ్యాడు. ఎట్టకేలకు చిరంజీవితో వేదాళం రీమేక్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. కాని కరోనా కారణంగా ప్రాజెక్ట్ మరీ ఆలస్యం అవుతోంది.