Begin typing your search above and press return to search.

నాగశౌర్య సినిమాతో పోలిక పై నాని దర్శకుడి స్పందన..!

By:  Tupaki Desk   |   4 Jun 2022 4:30 PM GMT
నాగశౌర్య సినిమాతో పోలిక పై నాని దర్శకుడి స్పందన..!
X
'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వివేక్ ఆత్రేయ.. 'బ్రోచేవారెవరురా' చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత ఇప్పుడు 'అంటే.. సుందరానికీ!' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని మరియు నజ్రియా నజీమ్ ఫహాద్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ 'అంటే సుందరానికీ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. రిలీజ్ కు రెడీ అయింది. జూన్ 10న థియేటర్లలోకి రాబోతోంది.

అయితే నాని సినిమా మరియు నాగశౌర్య నటిస్తోన్న 'కృష్ణ వ్రింద విహారి' మూవీ రెండూ ఒకే ఫ్లాట్ తో రాబోతున్నాయని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిల్లో హీరోలు బ్రాహ్మణ యువకుడి పాత్రలు పోషించడం.. మోడ్రన్ అమ్మాయిని ప్రేమించడమే ఈ చర్చకు కారణం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం మీద 'అంటే సుందరానికి' దర్శకుడు వివేక్ ఆత్రేయ స్పందించారు. "ఒకసారి 'కృష్ణ వ్రింద విహారి' సినిమాటోగ్రాఫర్ శ్రీరామ్ నాకు ఫోన్ చేశారు. తమ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా వివేక్ సాగర్ ను తీసుకునే అంశంపై మాట్లాడారు''

''అప్పటికే నాకు నాని సినిమా ఓకే అయిపోయింది. అప్పుడు మాటల సందర్భంలో ఏంటి స్టోరీ అని అడిగారు. ఇలా అనుకుంటున్నాను అని కాన్సెప్ట్ చెప్పాను. మాది కూడా ఇంచుమించు అదే కథ అని ఆయన అన్నారు. ఆ తర్వాత అంత డీప్ గా దాని గురించి మేం మాట్లాడుకోలేదు''

'కృష్ణ వ్రింద విహారి' దర్శకుడు అనీష్ నాకు ఫ్రెండ్. ఇద్దరం కలిసి క్రికెట్ కూడా ఆడుకునేవాళ్ళం. ఒకసారి అతడితో దీని గురించి మాట్లాడాను. ఏంటి మన ఇద్దరి స్టోరీలు ఒకటే అనుకుంటున్నారు అని చర్చించాను. రెండింటిలో హీరో హిందూ బ్రాహ్మిణ్. అంతవరకు మాత్రమే సిమిలారిటీ ఉంది. అంతకుమించి నేను డీప్ గా అడగలేదు"

''శ్రీరామ్ కాల్ చేసి సమయానికే నానికి కథ చెప్పేశాను. నాకు సినిమా కూడా ఓకే అయిపోయింది. పత్రికల్లో ఆర్టికల్స్ కూడా వచ్చేశాయి'' అని వివేక్ ఆత్రేయ చెప్పుకొచ్చారు. ఇలా నాగశౌర్య - నాని సినిమాలలో హీరో పాత్ర తప్ప.. రెండింటి మధ్య సంబంధం లేదని దర్శకుడు స్పష్టం చేశారు.

'అంటే సుందరానికి' అందరికీ తెలిసిన కథే అయినా.. కొత్తగా చెప్పడానికి ప్రయత్నించానని తెలిపారు. ఎవరి మనోభావాలు కించపరచాలనే ఉద్దేశ్యంతో తాను ఈ సినిమా చేయలేదని వివేక్ చెప్పుకొచ్చారు.