Begin typing your search above and press return to search.
'సీటీమార్'తో మళ్లీ థియేటర్లు కళకళలాడటం ఖాయం: దర్శకుడు సంపత్ నంది
By: Tupaki Desk | 9 Sep 2021 7:32 AM GMTగోపీచంద్ కథానాయకుడిగా .. కబడ్డీ నేపథ్యంలో 'సీటీమార్' రూపొందింది. చిట్టూరి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకి, సంపత్ నంది దర్శకత్వం వహించాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై సంపత్ నంది మాట్లాడుతూ .. "ఈ రోజున నేను మనకి .. సినిమాకి .. థియేటర్ కి ఉన్న బాండింగ్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మనకి స్వాతత్య్రం రావడానికి ముందే మన జీవితాల్లోకి సినిమా వచ్చింది.
మూకీ .. టాకీ .. బ్లాక్ అండ్ వైట్ .. కలర్ .. ఇలా సినిమా తన రూపు రేఖలను మార్చుకుంటూ వచ్చింది. చైనా తరువాత ఎక్కువ థియేటర్లు ఉన్న దేశం మనది. మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 3000 థియేటర్స్ ఉన్నాయి. ఇండియాలో క్రికెట్ తరువాత అందరూ కోరుకునే వినోద సాధనం ఏదైనా ఉందంటే అది సినిమానే. పండగలు అప్పుడప్పుడు వస్తుంటాయి .. కానీ సినిమా పండుగ ప్రతి ఫ్రైడే వస్తుంది. కొంతమంది గుడికి .. కొంతమంది చర్చికి ... మరికొంతమంది దర్గాలకు వెళతారు. కానీ అన్ని మతాలవారు వెళ్లేది థియేటర్ కే.
అలాంటి థియేటర్ ఈ రోజున కష్టంలో ఉంది. ఏడాదిన్నరకి పైగా కటౌట్లు లేవు .. పాలాభిషేకాలు లేవు .. టికెట్ల కోసం క్యూలో నుంచోవడం లేదు .. టిక్కెట్ల కోసం కొట్టుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఫస్టు లాక్ డౌన్ తరువాత 'క్రాక్' విజృంభించింది. ఆ రేంజ్ లో థియేటర్ల దగ్గర సందడి చూడటం కోసమే, ఓటీటీ ఆఫర్లు భారీగా వచ్చినా మా నిర్మాతలు వెయిట్ చేస్తూ వచ్చారు. ఎన్నో విడుదల తేదీలు మార్చుకుంటూ 'వినాయకచవితి' రోజున మీ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ వినాయక చవితితో అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను.
'సీటీమార్' అనేది ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో జరిగిన సినిమా. 'దంగల్' సినిమా మాదిరిగానో ... 'చెక్ దే' మాదిరిగానో ఇది పూర్తి స్పోర్ట్స్ సినిమా కాదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కమర్షియల్ ఫిల్మ్. ఒక్క మాటలో చెప్పాలంటే మీరంతా ఆశించేటువంటి మాస్ కమర్షియల్ ఫిల్మ్. మీరు ఏ నమ్మకంతో అయితే సినిమాకి వస్తారో, ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందని చెబుతున్నాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.