Begin typing your search above and press return to search.
పవన్ తో దర్శకధీరుని రహస్య భేటీ?
By: Tupaki Desk | 23 Nov 2021 5:30 AM GMT2022 సంక్రాంతి బరిలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా మరో రెండు అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఢీ అంటే ఢీ అంటూ బరిలో దిగుతున్నాయి. అయితే ఈ సన్నివేశం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ కి తలనొప్పి వ్యవహారంగా మారింది. మొదటి వారంలో థియేటర్ల షేరింగ్ వల్ల రెవెన్యూ లాస్ భారీగా ఉంటుంది. దానివల్ల భారీ మొత్తాల్ని వెచ్చించి కొనుక్కున్న పంపిణీ వర్గాలకు బయ్యర్లకు నష్టాల వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అయితే దీనికి పరిష్కార మార్గం కనుగొనేందుకు ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తనవంతు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా RRR రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే అంతకుముందే ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ ధర సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ కి జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో అతిపెద్ద అడ్డంకిగా ఉంది. టికెట్ ధరల పెంపుపైనా రాజమౌళి పోరాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇక స్పెషల్ షోల గురించి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది.
దానికి తోడు కొత్త తలనొప్పి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రూపంలో వచ్చింది. భీమ్లా నాయక్ చిత్రం విడుదల తేదీ 12 జనవరి 2022కి కట్టుబడి ఉంటుందని నిర్మాతలు ఖరాకండిగా ప్రకటించారు. ఇది ఖచ్చితంగా భారీ పాన్ ఇండియా సినిమాల కలెక్షన్ లకు గండికొడుతుంది. థియేటర్ల ఘర్షణ గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే వీటన్నిటికీ పరిష్కారం చూపించాలని పవన్ ని కలిసేందుకు పలువురు పెద్ద మనుషులు రెడీ అవుతున్నారని కథనాలొచ్చాయి.

రాజమౌళి స్వయంగా పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా కలుసుకుని భీమ్లా నాయక్ విడుదలను వాయిదా వేయమని అభ్యర్థించడానికి ప్లాన్ లో ఉన్నారని ఈ సమావేశం వచ్చే వారం హైదరాబాద్ లో జరిగే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ ని కలిసే ముందే ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ ని ప్రసన్నం చేసే ఎత్తుగడను అనుసరిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు కూడా పవన్ ని కలిసే ముందు త్రివిక్రమ్ తో మాట్లాడేందుకు యత్నించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు వయా త్రివిక్రమ్ పవన్ ని కలుస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి అన్ని ప్రయత్నాలు సీరియస్ గానే సాగుతున్నాయి. అయితే గురుడు ఒప్పుకుంటారా? అన్నదే వేచి చూడాలి. ప్రస్తుతానికి RRR భీమ్లా నాయక్ .. రాధే శ్యామ్ 2022 సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ భవిష్యత్ లో ఇది మారే అవకావం ఉంది. భీమ్లా నాయక్ ని కాస్త అటూ ఇటూ గా రిలీజ్ చేసేలా ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే తన సినిమా సోలోగా వస్తే దానిని జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందనే భయాందోళనలు పవన్ లో ఆయన నిర్మాతల్లో ఉన్నాయని మరో గుసగుస వినిపిస్తున్న సంగతి తెలిసిందే.