Begin typing your search above and press return to search.

హీరోగా మారిన డైరెక్టర్ సెల్వరాఘవన్... ముఖ్యపాత్రల్లో కీర్తి సురేష్

By:  Tupaki Desk   |   17 Aug 2020 3:45 AM GMT
హీరోగా మారిన డైరెక్టర్ సెల్వరాఘవన్... ముఖ్యపాత్రల్లో కీర్తి సురేష్
X
ప్రముఖ సినీ దర్శకుడు సెల్వరాఘవన్ హీరోగా నటించనున్నారు. యువ దర్శకుడు అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేయగా సోషల్ మీడియాలో విపరీతంగా స్పందన వచ్చింది. ఈ చిత్రంలో జాతీయ నటి కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో నటించనుంది. సెల్వరాఘవన్ తెలుగులో 7/జీ బృందావన్ కాలనీ, యుగానికి ఒక్కడు, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాల ద్వారా సుపరిచితుడు.

ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన 'ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే' సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ ని సెల్వరాఘవన్ ప్రత్యేకంగా చూపించారు. డైలాగ్ డెలివరేషన్, కామెడీ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో సెల్వరాఘవన్ దర్శకత్వం వహించలేదు. తమిళ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ పలు విజయాలు అందుకొన్నాడు. 'సానిక్ కాయిదమ్' చిత్ర దర్శకుడు అరుణ్ మహేశ్వరన్ ఇదివరకు ' రాఖీ 'అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఆ సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. లాక్ డౌన్ కాలంలో మరో కథ సిద్ధం చేసిన అరుణ్ ఇటీవలే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇక కీర్తి సురేష్ మహానటి తర్వాత బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఆమె ప్రస్తుతం నితిన్ తో 'రంగ్ దే 'లో నటిస్తున్నారు. మహేష్ బాబు- పరశురాం కాంబినేషన్లో వస్తున్న 'సర్కారు వారి పాట'లోనూ కీర్తిసురేషే కథానాయిక. వరుసగా ముఖ్యమైన సినిమాల్లో మాత్రమే నటిస్తున్న కీర్తిసురేష్ అనూహ్యంగా 'సానిక్ కాయిదమ్' సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.