Begin typing your search above and press return to search.
చిట్టిలు వస్తూనే ఉంటారట!
By: Tupaki Desk | 26 Nov 2018 9:03 AM GMTభారతదేశ సినిమా చరిత్రలో కనివిని ఎరుగని బడ్జెట్ తో రూపొందినట్టుగా చెప్పబడుతున్న 2.0 విడుదల ఇంకో 70 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే వెండితెరపై విధ్వంసం సృష్టించబోతోంది. కనివిని ఎరుగని స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. రజని సినిమాలలోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ ని ట్రేడ్ ఆశిస్తోంది. ఇక దీనికి సీక్వెల్ ఉంటుందా అనే అనుమానం ముందు నుంచే ఉంది.
దానికి శంకర్ స్పష్టంగా సమాధానం ఇస్తున్నాడు. రజనికాంత్ సై అంటే 3.0 తీయడానికి సిద్ధంగా ఉన్నానని అయితే దానికి తగ్గ ఆలోచన కథ తన మైండ్ లోకి వచ్చినప్పుడు జరుగుతుందని సమాధానం ఇస్తున్నాడు. హాలీవుడ్ లో స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ సిరీస్ లాగా ఇండియాలో రోబో సిరీస్ శాశ్వతం కావాలనేదే శంకర్ లక్ష్యమట. అంతా బాగానే ఉంది కాని రజనికి వయసు మీరుతోంది. 2.0 కే చాలా కష్టపడి పలుమార్లు చికిత్స కోసం అమెరికా కూడా వెళ్లి వచ్చారు. కొత్త సినిమాలు సైతం రిస్క్ లేకుండా కేవలం రెండు నెలలలోపే షూటింగ్ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్న వాళ్ళ కథలనే వింటున్నాడు.
మరి 3.0 ఐడియా శంకర్ కు కుదిరినా రజనితో చేయడం చాలా పెద్ద రిస్క్ అవుతుంది. గ్రాఫిక్స్ లేకుండా ఇలాంటి సినిమాలు చేయలేం కాబట్టి ఇంతకు మించి అనేలా తీస్తే తప్ప అంచనాలు అందుకోవడం అసాధ్యం. ఇంకో స్టార్ హీరో ఎవరైనా చూసుకోకతప్పదు. స్పైడర్ మ్యాన్ అయినా జేమ్స్ బాండ్ అయినా అన్ని సినిమాల్లో ఒకే హీరో లేరు. మారుతూ వచ్చారు. మరి చిట్టి రోబోగా ఎల్లకాలం రజనినే చూపలేం కాబట్టి వేరే ఆప్షన్ చూడాల్సిందే. అయిన కొత్తగా ఆలోచించకుండా ఈ రోబో సీక్వెళ్ళు ఇండియన్ సిరీస్ లు ఏంటి అంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు