Begin typing your search above and press return to search.
రోబో-2.. మూడింట రెండొంతులు
By: Tupaki Desk | 5 Oct 2016 11:30 AM GMTఆ మధ్య సమ్మర్లో డైరెక్టర్ శంకర్ ట్విట్టర్లో ఓ మెసేజ్ పెట్టాడు. 100 డేస్.. 50 పర్సంట్ లోడింగ్.. అంటూ ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ గురించి అప్ డేట్ ఇచ్చాడు. అంటే వంద రోజుల షూటింగులో 50 శాతం టాకీ పార్ట్ పూర్తి చేసేశామన్నది ఆయన ఉద్దేశం. ఆ తర్వాత కొన్ని నెలల విరామం వచ్చింది. రెండు నెలల కిందట రోబో-2 షూటింగ్ తిరిగి మొదలైంది. రజినీకాంత్ కూడా గత నెలలో మేకప్ వేసుకుని షూటింగుకి రెడీ అయిపోయాడు. ఇప్పుడు శంకర్ కొత్తగా ఇంకో అప్ డేట్ ఇచ్చాడు. ఈసారి కూడా ఆయన కోడ్ లాంగ్వేజే వాడాడు.
‘2.0 2/3 150’ అన్నది ఆయన పెట్టిన మెసేజ్. అంటే 2.0 సినిమా షూటింగ్ 150 రోజులు చేశాం. మూడింట రెండొంతుల టాకీ పార్ట్ పూర్తయిందన్నది ఆయన ట్వీట్ సారాంశం అన్నమాట. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శంకర్ ఎంత వేగంగా చేస్తున్నాడో చెప్పడానికిది రుజువు. ఏడాది పాటు కష్టపడి పక్కాగా స్క్రిప్టు రెడీ చేసుకున్న శంకర్.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సాగిపోతున్నాడు. విజువల్ ఎఫెక్టుల కోసం ఆరు నెలలకు పైగానే కేటాయించాల్సి ఉండటంతో ఈ ఏడాది చివర్లోగా టాకీ పార్ట్ పూర్తి చేసేయాలని శంకర్ భావిస్తున్నాడు. ఇందుకోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ‘2.0’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నవంబర్లోనే ఫస్ట్ లుక్.. లోగోను పరిచయం చేస్తారని సమాచారం.