Begin typing your search above and press return to search.

జక్కన్నకి 'మహారాజ'మౌళి అంటూ ఇండియాస్ బిగ్గెస్ట్‌ డైరెక్టర్ బిరుదు

By:  Tupaki Desk   |   26 March 2022 7:11 AM GMT
జక్కన్నకి మహారాజమౌళి అంటూ ఇండియాస్ బిగ్గెస్ట్‌ డైరెక్టర్ బిరుదు
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. అంతా ఆశించినట్లుగానే.. ఊహించినట్లుగానే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విజువల్ వండర్ గా.. భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా... ఎమోషన్స్ పీక్స్ స్థాయి అన్నట్లుగా ఉంది. ఈ సినిమా ను ఒక్కరు ఇద్దరు తేడా గాళ్లు తప్ప దాదాపు అంతా కూడా యూనానిమస్ గా అద్బుతం.. ఇది రాజమౌళికే సాధ్యం అంటూ ఘన కీర్తిని జక్కన్నకు కట్టబెడుతున్నారు.

తాజాగా తమిళ దర్శకుడు శంకర్ ఆర్ ఆర్‌ ఆర్ సినిమా పై స్పందించాడు. రాజమౌళికి సమకాలీకుడు.. సమ ఉజ్జీగా పేరు దక్కించుకున్న శంకర్ నుండి ఆర్ ఆర్‌ ఆర్ సినిమా గురించి కామెంట్స్ రావడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. అద్బుతమైన విజువల్ వండర్‌ ను జక్కన్న రాజమౌళి ప్రేక్షకులకు అందించాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ట్విట్టర్ లో స్పెషల్‌ గా ఈ సినిమా గురించి స్పందిస్తూ శంకర్ ట్వీట్‌ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

ట్విట్టర్ లో శంకర్... ఆర్ ఆర్‌ ఆర్‌ కి సరికొత్త అర్థంను మీరు మాకు చెప్పారు. ఇలాంటి ఒక అద్బుతమైన సినిమాను అందించినందుకు ప్రతి ఒక్క చిత్ర యూనిట్‌ సభ్యులకు కూడా కృతజ్ఞతలు. రామ్‌ చరణ్‌ అద్బుతమైన స్క్రీన్‌ ప్రజెన్స్ మరియు నటన అలాగే కొమురం భీమ్ గా ఎన్టీఆర్‌ ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకునే విధంగా ఉంది. మీ యొక్క ఊహా శక్తికి.. దాన్ని తెరపై చూపించిన విధానంకు హ్యాట్సాఫ్ అంటూ రాజమౌళికి 'మహారాజ'మౌళి అంటూ శంకర్ బిరుదును ఇచ్చాడు.

రోబో 2 వంటి అద్బుతమైన సినిమాలను తెరకెక్కించి సరికొత్త చరిత్రను సృష్టించిన సౌత్‌ ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్‌ కు తీసుకు వెళ్లిన ఘనత శంకర్‌ కు దక్కింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ శంకర్ మన రాజమౌళి గురించి మహారాజ మౌళి అంటూ కితాబివ్వడం అత్యంత గౌరవంగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే శంకర్ నుండి దక్కిన ప్రశంసలు ఖచ్చితంగా చాలా స్పెషల్‌ అనడంలో సందేహం లేదు. రాజమౌళి ఈ కామెంట్స్ కు ఎలా స్పందిస్తాడో చూడాలి. వందల కొద్ది ప్రముఖులు ఈ సమయంలో సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జక్కన్న ట్విట్టర్ లో స్పందించలేదు. ఆయన ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లోనే ఇంకా బిజీగా ఉన్నాడు.