Begin typing your search above and press return to search.
ఇంత కన్ఫ్యూజన్ ఏంటి శంకర్ ?
By: Tupaki Desk | 1 May 2019 6:44 AM GMTఒకప్పుడు సోషల్ మెసేజ్ ని కమర్షియల్ ఫార్మట్ లో తీసి బ్లాక్ బస్టర్స్ కొట్తడంలో శంకర్ తర్వాతే ఎవరైనా అనే స్థాయిలో పేరుండేది. కాని ఎందుకనో గత నాలుగైదు ఏళ్ళుగా తన స్థాయి సబ్జెక్టుని ఎంచుకోలేకపోతున్న శంకర్ గ్రాఫిక్స్ మాయాజాలంలో పడిపోయి తన బ్రాండు మేకింగ్ ని చూపించలేకపోతున్నాడు. రోబో అద్బుతాలు చేసినప్పటికీ గత ఏడాది వచ్చిన సీక్వెల్ 2.0 ఆ రేంజ్ వసూళ్ళను దక్కించుకోలేదన్నది నిజం. కలెక్షన్లను పక్కనపెడితే కంటెంట్ ఏమంత గొప్పగా చెప్పుకునేలా లేకపోవడం శంకర్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది.
ఇటీవలే ఇండియన్ 2ని మొదలుపెట్టిన శంకర్ దాని తర్వాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. నిర్మాణ సంస్థ లైకా సైలెంట్ అయిపోయింది. కమల్ హాసన్ రాజకీయాల కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాడు. ఈ లెక్కన ఇండియన్ 2 షూటింగ్ ఆగిపోయిందా అనే టాక్ చెన్నై మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఈసారి కూడా శంకర్ ఎక్కువ బడ్జెట్ అడిగాడని ఇప్పుడు కమల్ మీద అంత పెట్టుబడి వర్క్ అవుట్ కాదనే భావనలో లైకా సంస్థ ఉందని అందుకే కొద్దిరోజులు ఆపాలని నిర్ణయించుకున్నట్టు గట్టి వార్తలే వచ్చాయి.
మరోవైపు ఇందులో హీరొయిన్ గా ఎంపికైన కాజల్ అగర్వాల్ సైతం ఇండియన్ 2 తప్ప అన్ని విశేషాలు షేర్ చేసుకుంటోంది. సో దీని మీద అనుమానాలు రావడం సహజం. ఇవి చాలదు అన్నట్టు చిరంజీవి కోసం శంకర్ ఓ స్టొరీ సిద్ధం చేసాడనే న్యూస్ మొన్న హల్చల్ చేసింది. ఈ నేపధ్యంలో శంకర్ అసలు ఇండియన్ 2ని ముందుకు తీసుకెళ్తాడా లేక ఇంకో కొత్త కథ ఏమైనా రెడీ చేసుకుంటాడా అంతా అయోమయంగానే ఉంది. తనే క్లారిటీ ఇస్తే బెటర్