Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ లేకుండానే మొదలెట్టబోతున్నాడట
By: Tupaki Desk | 11 Dec 2019 7:20 AM GMTరజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నాడు. వచ్చే ఏడాది లేదంటే త్వరలోనే రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అంటూ ఆయన అభిమానులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లే లోపు సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేయాలని రజినీకాంత్ భావిస్తున్నాడు. అందుకే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దర్బార్ చిత్రాన్ని చేస్తున్న రజినీకాంత్ సంక్రాంతికి ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
దర్బార్ చిత్రం తర్వాత రజినీకాంత్ చేయబోతున్న సినిమాకు శివ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. శివ దర్శకత్వంలో రజినీకాంత్ 168 చిత్రం షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. వచ్చే వారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను దర్శకుడు శివ ప్రారంభించబోతున్నాడు. అయితే మొదటి షెడ్యూల్ లో రజినీకాంత్ లేకుండానే చిత్రీకరణ చేయబోతున్నాడట.
రజినీకాంత్ 'దర్బార్' చిత్రం విడుదలైన తర్వాత షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఆలస్యం చేయకుండా రజినీ 168 చిత్రంను చకచక దర్శకుడు శివ తెరకెక్కించబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో లేదా దసరా దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని రజినీకాంత్ మరియు శివలు భావిస్తున్నారట. ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్నారు. ఇక ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. రజినీకాంత్ తో కలిసి నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఇటీవలే కీర్తి సురేష్ ఒక వీడియోలో పేర్కొంది.