Begin typing your search above and press return to search.
ఇప్పటి నుంచైనా వాటి బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా : పూరీ
By: Tupaki Desk | 28 May 2020 2:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. దీని వలన ప్రపంచం మొత్తం ఇళ్లలో బంధీ అయిందని చెప్పవచ్చు. మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వలన ప్రజలు కాలు బయట పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే నిభందనలు సడలిస్తూ వస్తుండటం వలన జనం రోడ్లపై తిరగడం స్టార్ట్ చేసారు. కానీ గత రెండు నెలలుగా ఇంట్లోనే బంధీగా ఉండటం ఎంత కష్టమో తెలుసుకున్నారు. అయితే మనం రెండు నెలలు బంధీ అవడం ఇంత కష్టంగా ఉంటే మూగజీవాలైన పక్షులను జంతువులను ఎప్పటి నుంచో మనం బందిస్తూ వస్తున్నాం. మరి ఆ ప్రాణులు ఎంత అవస్థలు పడుతుంటాయో ఎప్పుడైనా ఆలోచించామా..?
ఇప్పుడు ఇదే విషయాన్ని డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గుర్తు చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ కి పక్షులన్నా జంతువులన్నా ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఏనిమల్ లవర్ అయిన పూరీ తన ఇంట్లో ఆఫీస్ లో డాగ్స్ ని పక్షులను పెంచుతూ ఉంటాడు. ఇతర దేశాల నుండి కూడా వాటిని తెప్పించుకొని పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు లేటెస్టుగా పూరీ జగన్నాథ్ పక్షులు జంతువులను మన ఎంటర్టైన్మెంట్ కోసం ఎంతలా బాధ పెడుతున్నామో గుర్తు చేస్తూ ఒక వీడియో షేర్ చేసాడు. ఈ వీడియో చూస్తే మనం వాటి పట్ల ఎలా వ్యవహరిస్తున్నామో అర్థం అవుతోంది. ఇప్పటికైనా మూగ ప్రాణుల బాధను ఫీల్ అవుతారని ఆశిస్తున్నానని పూరీ జగన్నాథ్ పేర్కొన్నాడు.
'ఇప్పటికైనా వాటి బాధను అర్థం చేసుకుంటారు'' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు పూరీ. ఈ వీడియోలో మనుషుల తమ ఎంటర్టైన్మెంట్ కోసం పక్షులు జంతువులు బంధించబడి.. ఎంతగా బాధలు పెడుతున్నారో తెలియజెప్పే ప్రయత్నం చేసారు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం ఏర్పడిన విపత్కర పరిస్థితుల వలన ఖచ్చితంగా జనాలు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి వీడియోలు చూసైనా మూగ జీవాల గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తారేమో. పూరీ జగన్ పోస్ట్ చేసిన వీడియోకి నెటిజన్స్ ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో చూసి కన్నీళ్లు వస్తున్నాయని.. ఇప్పటి నుండైనా మన వినోదం కోసం వాటిని హింసించకుండా ఉంటారని ఆశిద్దాం అంటూ తమ ఫీలింగ్స్ వెల్లడిస్తున్నారు. కొంతమంది మాత్రం దీనికి ముగింపు లేదు.. హ్యూమన్ మైండ్ ఎప్పటికీ చేంజ్ అవదు.. వాటి భాదను అర్థం చేసుకోరు అని కామెంట్స్ చేస్తున్నారు.