Begin typing your search above and press return to search.
హీరో పుట్టక ముందే నా కథ పుట్టింది!
By: Tupaki Desk | 9 Nov 2021 10:38 AM GMTకార్తికేయ మరియు తన్య రవిచంద్రన్ జంటగా నటించిన 'రాజా విక్రమార్క' సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఆర్ ఎక్స్ 100 వంటి విభిన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కార్తికేయ ఆ తర్వాత వరుసగా మంచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతున్నా కూడా కార్తికేయ సినిమాల జోరు మాత్రం తగ్గడం లేదు. విభిన్న చిత్రాలతో కార్తికేయ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా కూడా ప్రయత్నాలు చేస్తూ మంచి పేరు దక్కించుకుంటున్న హీరో కార్తికేయ. ఈ వారం రాజా విక్రమార్క తో రాబోతున్న కార్తికేయకు ఒక మంచి సాలిడ్ మాస్ హిట్ పడటం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన అభిమానులు కూడా రాజా విక్రమార్క సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. రాజా విక్రమార్క కథ కార్తికేయకు చాలా బాగా సూట్ అయ్యే సబ్జెక్ట్ లా ఉందని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది.
దర్శకుడు కార్తికేయను మనసులో పెట్టుకుని ఈ కథను రాసినట్లుగా ఉన్నాడు. అందుకే ఇంత బాగా వచ్చిందని.. అతడి బాడీ లాంగ్వేజ్ కు తగ్గ మంచి పాత్రను దర్శకుడు శ్రీ సరిపల్లి రాశాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో దర్శకుడు శ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఈ కథను చాలా కాలం క్రితం రాసుకున్నాడట. ఏ ఒక్క హీరోను మనసులో పెట్టుకుని ఈ కథను రాయలేదట. ఒక మాట చెప్పాలంటే ఈ కథ రాసుకున్న సమయంలో కార్తికేయ కనీసం హీరోగా కూడా పుట్టలేదట. అంటే కార్తికేయ ఆర్ ఎక్స్ 100 సినిమా విడుదల అవ్వలేదట. కథ రాసుకున్న కొన్నాళ్ల తర్వాత ఆర్‌ఎక్స్ 100 విడుదల అవ్వడం.. ఆ సమయంలో ఈ కథకు కార్తికేయ బాగుంటాడని భావించడం జరిగిందట.
ఆర్‌ఎక్స్ 100 సినిమా చూసిన తర్వాత కార్తికేయను కలిసి రాజా విక్రమార్క కథను చెప్పాడట. కాని అప్పటికే కొన్ని సినిమాలు కమిట్ అయ్యి ఉండటం వల్ల వాయిదా పడుతూ వచ్చిందట. ఎట్టకేలకు కార్తికేయ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. వెంటనే డేట్లు ఇవ్వడం జరిగింది. రాజా విక్రమార్క విభిన్నమైన మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని దర్శకుడు అంటున్నాడు. నేను రాసుకున్న కథకు నేను అనుకున్నట్లుగానే కార్తికేయ చాలా చక్కగా న్యాయం చేశాడు. ఇది ఒక మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని.. ఇప్పటి వరకు వచ్చిన కాప్ స్టోరీస్ కు విభిన్నంగా ఉంటుందని మేకర్స్ చాలా నమ్మకంతో చెబుతున్నారు. కామెడీతో పాటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే ఈ సినిమా కార్తికేయ కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలుస్తుందా అనేది చూడాలి.