Begin typing your search above and press return to search.
శ్రీనువైట్లకు ఊపిరి పోస్తున్న హీరో ఎవరు?
By: Tupaki Desk | 5 Oct 2022 11:33 PM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కెరీర్ డైలమా గురించి తెలిసిందే. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు తెరకెక్కించిన వైట్ల ఇటీవల అప్స్ అండ్ డౌన్స్ ని చవి చూశాడు. ఈ సందిగ్ధం నుంచి బయటపడాలంటే విజయమే ఆయుధం. ఒకే ఒక్క హిట్టు కొట్టి అతడు అన్నిటినీ అధిగమించాలని కలలుగంటున్నాడు.
తాజాగా అతడు దసరా వేళ తన లైఫ్ లో ఒక కొత్త మలుపు గురించి వెల్లడించాడు. టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో గోపీచంద్ తో కలిసి సినిమాని ప్రారంభిస్తున్నానని శ్రీను సోషల్ మీడియాల్లో వెల్లడించారు. గోపిచంద్ ఇటీవల మారుతీ దర్శకత్వం వహించిన `పక్కా కమర్షియల్`తో ఆశించినంత విజయం అందుకోలేకపోయాడు.
ప్రస్తుతం `లక్ష్యం` రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీవాస్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గోపీచంద్ తదుపరి శ్రీనువైట్లతో కలిసి నటించనున్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నా ఇప్పటికి దర్శకుడు స్వయంగా దీనిని ప్రకటించారు.
శ్రీనువైట్ల- గోపీచంద్ ల కాంబినేషన్ పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దూకుడు- రెడీ- వెంకీ- దుబాయ్ శీను వంటి చిత్రాలకు పనిచేసిన రచయిత గోపి మోహన్ ఈ చిత్రంతో భాగం కానున్నారు. గోపిమోహన్ తో శ్రీనువైట్ల అసోసియేషన్ ప్రతిసారీ సక్సెసైంది. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగేందుకు ఆస్కారం ఉంది. మిగిలిన వివరాలు అతి త్వరలో వెల్లడిస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.