Begin typing your search above and press return to search.

అసలు శ్రీమంతుడు, మహర్షి వచ్చేవి కావు

By:  Tupaki Desk   |   12 April 2023 5:25 PM GMT
అసలు శ్రీమంతుడు, మహర్షి వచ్చేవి కావు
X
కామెడీతో యాక్షన్ సన్నివేశాలను మేళవించి ఎంటర్ టైన్ చేసే దర్శకుల్లో శ్రీవాస్ ఒకరు. ఈ దర్శకుడు చేసిన లక్ష్యం, లౌక్యం మూవీ మంచి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ శ్రీవాస్. 2007లో లక్ష్యం మూవీ తీసిన ఈ దర్శకుడు ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం వంటి చిత్రాలు తీశాడు. లక్ష్యం, లౌక్యం సినిమాల్లో హీరోగా గోపీచంద్ నటించగా వీరిద్దరి కాంబోలో మూడో సినిమా వస్తోంది. రామబాణం మూవీ మే నెల 5వ తేదీన విడుదల కానుంది.

నందమూరి బాలకృష్ణ సజెస్ట్ చేసిన 'రామబాణం' టైటిల్ తో ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ శ్రీవాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవిప్పుడు వైరల్ గా మారాయి. లక్ష్యం మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత దిల్ రాజు కు శ్రీవాస్ ఓ కథ చెప్పగా దానికి ఆయన ఇంప్రెస్ అయ్యారట. వారిద్దరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ కు నరేట్ చేయగా ఆయన కూడా కథ చాలా బాగుంది. 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి తీయాల్సిన సినిమా అన్నారట.

ఆ తర్వాత తాను బీవీఎస్ రవి, రత్నం కలిసి స్క్రిప్ట్ వర్కవుట్ చేసినట్లు చెప్పారు శ్రీవాస్. అదే సమయంలో దిల్ రాజు సోదరుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోగా ఆ అంశాన్ని కథలో భాగం చేశారట. కథ ఎక్సలెంట్ గా వచ్చిందని, ఫైనల్ కథను తారక్ వద్దకు తీసుకెళ్లామని శ్రీవాస్ చెప్పారు. కథ పూర్తిగా విన్న తర్వాత తారక్ చిన్న డౌట్ పడ్డారని, ఆ కథ తనకు వర్కవుట్ అవుతుందా అని అనుమాన పడ్డారని శ్రీవాస్ చెప్పుకొచ్చారు.

దాదాపు 5 నెలల పాటు కూర్చొని వర్కౌట్ చేసి ఫైనల్ చేసిన కథను మరో హీరో చేస్తే బాగుంటుందని తారక్ అనేసరికి బ్లాంక్ అయ్యాయని చెప్పారు శ్రీవాస్. ఒకవేళ ఆ కథ చేసి ఉంటే శ్రీమంతుడు, శతమానం భవతి, మహర్షి కథలు బయటకు వచ్చేవి కావన్నారు డైరెక్టర్ శ్రీవాస్. ఆ తర్వాత అదే కథను పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లగా.. చాలా ఎగ్జయిట్ అయిపోయి వర్క్ చేద్దాం అన్నారని, కానీ రాజకీయ పనుల వల్ల కుదర్లేదని చెప్పారు.