Begin typing your search above and press return to search.

ఐమ్యాక్స్ లో చూస్తే ఆ రేంజే వేరప్పా!

By:  Tupaki Desk   |   10 Aug 2019 1:43 PM GMT
ఐమ్యాక్స్ లో చూస్తే ఆ రేంజే వేరప్పా!
X
`సాహో` సినిమాని బాహుబ‌లి రేంజు స్కేల్ లో తీస్తున్నారు స‌రే.. అయినంత మాత్రాన ఈ సినిమాకి మాత్ర‌మే అని చెప్పుకునే యూనిక్ క్వాలిటీ ఏమిటి? ఇండియ‌న్ సినిమా స్క్రీన్ పై భారీ యాక్ష‌న్ చిత్రాలు ఎన్నో వచ్చాయి. వాటితో పోలిస్తే `సాహో` ఏవిధంగా ఎక్స్ క్లూజివ్? అంటే అందుకు ద‌ర్శ‌కుడు సుజీత్ జ‌వాబిచ్చారు.

ఈ సినిమాకి ఉప‌యోగించిన సాంకేతిక‌త పూర్తిగా వేరు. భారీ యాక్ష‌న్ దృశ్యాల్ని తెర‌కెక్కించాలంటే అందుకు త‌గ్గ హై ఎండ్ కెమెరాల్నే ఎంపిక చేసుకున్నామ‌ని సుజీత్ తెలిపారు. అది కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్ కోసం ఉప‌యోగించే కెమెరాల్ని ఎంపిక చేసుకున్నామ‌ని వెల్ల‌డించారు. స‌హ‌జంగా సినిమా తీసేశాక తిరిగి దానిని ఐమ్యాక్స్ అనుభూతి కోసం డిజిట‌ల్ లో మాస్ట‌రింగ్ చేస్తుంటారు. అలా కాకుండా బ‌డ్జెట్ విష‌యంలో ఎలాంటి కక్కుర్తి లేకుండా కావాల్సినంత పెట్టారు మా నిర్మాత‌లు. అందుకే అత్యున్న‌త సాంకేతిత ఉన్న కెమెరాల్ని ఎంపిక చేసుకుని ఈ భారీ యాక్ష‌న్ చిత్రాన్ని తెర‌కెక్కించామ‌ని ముంబై మీడియాకి తెలిపారు. నేడు ముంబైలో `సాహో` ట్రైల‌ర్ ఈవెంట్ లో సుజీత్ ఈ సంగ‌తుల్ని వెల్ల‌డించారు.

ఇంత భారీ సినిమాని లో క్వాలిటీతో తెర‌కెక్కించ‌డం ఇష్టం లేకే టెక్నిక‌ల్ గా ఎక్క‌డా రాజీకి రాలేద‌ని వెల్ల‌డించారు. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించే విష‌యంలో అస‌లే రాజీ ప‌డ‌లేద‌న్నారు. ఇందుకోసం కాస్ట్ అండ్ క్రూ కూడా అంతే హార్డ్ గా శ్ర‌మించార‌ని .. సెట్స్ లో గంట‌ల కొద్దీ క‌ష్ట‌ప‌డ్డార‌ని సుజీత్ తెలిపారు. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తెస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంద‌న్నారు. అలాగే ఐమ్యాక్స్ స్క్రీన్ల‌లో ట్రైల‌ర్ ని ప్ర‌ద‌ర్శిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఆగ‌స్టు 30న `సాహో` ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.