Begin typing your search above and press return to search.
సాహో దర్శకుడి మీడియా ఎస్కేప్
By: Tupaki Desk | 28 Jun 2019 4:15 AM GMTఈ ఆదివారం దాటేస్తే సాహో విడుదలకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కాలం హారతి కర్పూరంగా కరిగిపోతున్న ట్రెండ్ లో ప్రమోషన్ విషయంలో ఏమంత దూకుడుగా వ్యవహరించకపోవడం ఫాన్స్ ని టెన్షన్ పెడుతోంది. ఎంత రెండు వందల కోట్ల బడ్జెట్ తో తీసిన పాన్ ఇండియా మూవీ అయినా పబ్లిసిటీ చేయక తప్పదు. కేవలం బాహుబలి ఇమేజ్ దీనికి కూడా అదే స్థాయి వసూళ్లు తెచ్చి పెడుతుందనుకోవడం కరెక్ట్ కాదు.
అందులోనూ ఇలాంటి గ్రాండియర్ మూవీస్ విషయంలో దర్శకుడి మీద అధిక భారం ఉంటుంది. కానీ సుజిత్ మాత్రం అవేవి పట్టనట్టు ఉంటున్నాడు. సాహోకు సంబంధించిన విశేషాలు ముంబై మీడియాతో షేర్ చేసుకుంటున్నాడు కానీ ఇక్కడి వారికి కనీసం పిఆర్ ల ద్వారా అయినా అప్ డేట్స్ ఇవ్వడం లేదు. అందులోనూ మన తెలుగు హీరోల అభిమానులు చాలా యాక్టివ్ గా ఉండే ట్విట్టర్ లోనూ ఈ దర్శకుడు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
ఫలానా సాంగ్ అయిపోయిందనో లేదా ఈ యాక్షన్ ఎపిసోడ్ బాగా వచ్చిందనో ఏదో ఒకటి చెబుతూ ఉంటే బాగుండేది. అక్కడికి కొందరు ఫ్యాన్స్ ఇతన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అందుకే ఈ అసంతృప్తి తగ్గాలి అంటే ఇకనైనా సుజిత్ బయటికి రావాలి. రెండో సినిమాకే ఇంత అద్భుతమైన ఆఫర్ కొట్టేసిన సుజిత్ దీంతో కనక మెప్పిస్తే ఆల్ ఇండియా లెవెల్ లో పేరు మారుమ్రోగిపోతుంది. కాకపోతే చేతిలో ఉన్న అతి తక్కువ టైంని జాగ్రత్తగా ప్లాన్ చేసి మీడియాకు డార్లింగ్ ఫాన్స్ కు అందుబాటులో ఉంటే బెటర్