Begin typing your search above and press return to search.

ప్రభాస్ ను డైరెక్ట్ చేయడంలో ఒత్తిడి లేదు!

By:  Tupaki Desk   |   14 Jun 2019 10:36 AM GMT
ప్రభాస్ ను డైరెక్ట్ చేయడంలో ఒత్తిడి లేదు!
X
దేశవ్యాప్తంగా సినిప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సాహో'. ఈ సినిమా టీజర్ గురువారం నాడు రిలీజ్ అయింది.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ను చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్ అయ్యారు. ఈ రెస్పాన్స్ తో 'సాహో' టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా 'సాహో' దర్శకుడు సుజిత్ మీడియా ప్రతినిథులతో ముచ్చటిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.

ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ ను డైరెక్ట్ చేయడం లో ఒత్తిడి ఉందా అని ప్రశ్నిస్తే "అసలు ప్రెజర్ లేనే లేదని.. ప్రభాస్ కు నా వర్క్ పై పూర్తిగా నమ్మకం ఉంది. నాకు ఆ విషయం మాత్రమే ముఖ్యం. అదే కాకుండా నిర్మాతలు.. టీమ్ మెంబర్స్ అందరూ నాపై నమ్మకం ఉంచారు. అయితే రిలీజ్ కు దగ్గరయ్యే కొద్ది నాకు కొంత ప్రెజర్ అనిపిస్తోంది" అని సమాధానం ఇచ్చాడు. 'బాహుబలి' కి ముందే 'సాహో' స్క్రిప్ట్ వినిపించానని.. ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటులను తీసుకోవడంపై స్పందిస్తూ అదిపనిగా బాలీవుడ్ నటులను ఎంపిక చేయాలనే ఉద్దేశం లేదని.. కథకు.. పాత్రలకు తగ్గట్టే క్యాస్టింగ్ జరిగిందని తెలిపాడు. హీరోయిన్ శ్రద్ధ కపూర్ గురించి చెప్తూ.. ఈ సినిమాలో హీరోయిన్ కు చాలా ప్రాధాన్యత ఉంటుందని.. నిజానికి స్టొరీ మొదటి నుండి చివరివరకూ శ్రద్ధా పాత్ర చుట్టూనే సాగుతుందన్నాడు. అందుకే టీజర్ లో ప్రభాస్ పైన కాకుండా ఓపెనింగ్ సీన్ శ్రద్ధాపై ఉంటుందని.. సినిమాలో శ్రద్ధకు అంత ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పాడు.

ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్ని బేట్స్ మాత్రమే కాకుండా ఈ సినిమాకు చైనీస్ స్టంట్ కోఆర్డినేటర్ పెంగ్ ఝాంగ్ కూడా ఈ సినిమాకు పని చేశారని.. యాక్షన్ సీక్వెన్స్ లు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని తెలిపాడు.