Begin typing your search above and press return to search.

కష్టకాలంలో సొంత గ్రామస్తులకు అండగా స్టార్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   28 March 2020 4:10 PM GMT
కష్టకాలంలో సొంత గ్రామస్తులకు అండగా స్టార్ డైరెక్టర్
X
కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రెటీ వరకు అంతా కూడా ఎఫెక్ట్‌ అవుతున్నారు. డబ్బున్న వారు నెల రెండు నెలలు ఏం చేయకున్నా కూడా వారికి పర్వాలేదు. కాని డైలీ కూలీలు ప్రతి రోజు ఏదో ఒక పని చేస్తే తప్ప సంపాదన లేని వారు ఈ పరిస్థితుల్లో అత్యంత గడ్డుకాలంను ఎదుర్కొంటున్నారు. వారికి సాయం చేసేందుకు ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు రేషన్‌ బియ్యంను ఉచితంగా ఇస్తున్న విషయం తెల్సిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తన సొంత గ్రామస్తులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

తూర్పు గోదావరి జిల్లా మకిలిపురం మండలం మట్టపుర్రు గ్రామం సుకుమార్‌ సొంత ఊరు. ఆ ఊర్లో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు సుకుమార్‌ తన దాతృత్వంను చాటుకుంటున్నాడు. గ్రామంలో డైలీ కూలీలకు సాయం అందించనున్నారు. గ్రామంలో రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. మొత్తంగా అయిదు లక్షల రూపాయలను ఆయన గ్రామస్తులకు ఇవ్వబోతున్నాడు.

ఇప్పటికే సుకుమార్‌ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పది లక్ష విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే. సినీ పరిశ్రమకు చెందిన పలువురు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. విభిన్నంగా దర్శకుడు సుకుమార్‌ తాను పుట్టి పెరిగిన గ్రామస్తులను ఆదుకునేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయం అంటూ ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.